గురువారం 28 మే 2020
International - Apr 14, 2020 , 19:16:24

చైనాను క్ష‌మాప‌ణ‌లు కోరిన మెక్‌డొనాల్డ్స్..

 చైనాను క్ష‌మాప‌ణ‌లు కోరిన  మెక్‌డొనాల్డ్స్..

అమెరికా కంపెనీ మెక్ డొనాల్డ్స్ చైనాకు సారి చెప్పింది.  ద‌క్షిణ‌చైనాలోని ఓ బ్రాంచ్ లో ఆఫ్రికా ప్ర‌జ‌ల‌ను నిషేదించ‌డం ప‌ట్ల చైనాలో వ్య‌తిరేక‌త వ‌చ్చింది.  ఆఫ్రికన్ల పట్ల వివక్షపూరితంగా ప్రవర్తించినట్లు వచ్చిన నివేదికల నేపథ్యంలో చైనాకు,  నల్లజాతీయులకు మెక్‌డొనాల్డ్స్ క్షమాపణలు చెప్పింది.   చైనాలో కొవిడ్ కేసులు పెరుగుతున్న నేప‌థ్యంలో  నల్లజాతీయులను రెస్టారెంట్‌లోకి అనుమతించవద్దని ఆ కంపెనీ నిర్ణ‌యించింది. మ‌రోవైపు విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రకటన ప్రకారం, 'ధృవీకరించబడిన రోగులు తప్ప, ఆఫ్రికన్ ప్రజలపై ఆరోగ్య నిర్వహణ (చర్యలు) ఎత్తివేస్తామని చైనా హామీ ఇచ్చింది. వివక్ష లేకుండా  చర్య తీసుకోవడానికి నిరంతరం చర్యలు  తీసుకుంటామ‌ని చైనా ప్ర‌భుత్వ అధికారులు వెల్ల‌డించారు'. 


logo