శనివారం 30 మే 2020
International - Apr 19, 2020 , 14:53:08

సింగపూర్‌లో మెక్‌డొనాల్డ్ సర్వీసుల నిలిపివేత

సింగపూర్‌లో మెక్‌డొనాల్డ్ సర్వీసుల నిలిపివేత

హైదరాబాద్: సింగపూర్‌లోని నలుగురు మెక్‌డొనాల్డ్ ఉద్యోగులకు కరోనా పాజిటివ్ రావడంతో ఆ నగరరాజ్యంలోని ఆపరేషన్స్  ఆదివారం నుంచి నిలిపివేశారు. డ్రైవ్-త్రూ, డెలివరీ సర్వీసులు కూడా నిలిపివేసినట్టు మెక్‌డొనాల్డ్ వెల్లడించింది. ఈ అమెరికా ఫాస్ట్‌ఫుడ్ కంపెనీ టేకవే సర్వీసును శనివారం నుంచే నిలిపివేసిందని ఛానల్ న్యూస్ ఏషియా తెలిపింది. కోవిడ్-19 వ్యాప్తి నివారణలో భాగంగా మే 4వ తేదీవరకు రెస్టారెంట్ల నిర్వహణ నిలిపివేయాలని సింగపూర్ ప్రభుత్వ ఆరోగ్యశాఖ సూచించిందని మెక్‌డొనాల్డ్ ఒక ప్రకటనలో వెల్లడించింది. సింగపూర్ లోని 135 రెస్టారెంట్లలో పనిచేస్తున్న పదివేలకు పైగా ఉద్యోగులకు జీతాలు కొనసాగిస్తామని వివరించింది. ఉద్యోగుల భద్రతకు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని మెక్‍‌డొనాల్డ్ పేర్కొన్నది. సింగపూర్‌లో సుమారు 6000 కరోనా కేసులు నమోదు కాగా 11 మంది మరణించారు.


logo