సోమవారం 28 సెప్టెంబర్ 2020
International - Jul 10, 2020 , 13:01:15

లైంగిక దాడి ఆరోప‌ణ‌లు.. శ‌వ‌మై తేలిన సియోల్ మేయ‌ర్‌

లైంగిక దాడి ఆరోప‌ణ‌లు.. శ‌వ‌మై తేలిన సియోల్ మేయ‌ర్‌

హైద‌రాబాద్‌:  ద‌క్షిణ కొరియా రాజ‌ధాని సియోల్ న‌గ‌ర మేయ‌ర్ పార్క్ వున్ సూన్‌.. అనుమానాస్ప‌ద రీతిలో మృతిచెందాడు. గురువారం అదృశ్య‌మైన అత‌ను.. న‌గ‌రానికి స‌మీపంలో ఉన్న కొండ‌ల్లో శ‌వ‌మై క‌నిపించాడు. ఫోన్ సిగ్న‌ల్ ఆధారంగా ఆ మేయ‌ర్ శ‌వం ఉన్న స్థ‌లాన్ని గుర్తించారు. సూసైడ్ కేసు కింద పోలీసులు విచార‌ణ చేప‌డుతున్నారు. ఇంటి నుంచి వెళ్లే ముందు మేయ‌ర్ పార్క్ త‌న కూతురికి మెసేజ్ చేసిన‌ట్లు తెలుస్తోంది. మేయ‌ర్ పార్క్ మృతికి ఒక్క రోజు ముందే అత‌నిపై లైంగిక దాడి ఆరోప‌ణ కేసు న‌మోదు అయ్యింది.  లైంగిక వేధింపుల‌కు పాల్ప‌డిన‌ట్లు ఓ మ‌హిళా ఉద్యోగి మేయ‌ర్‌పై ఫిర్యాదు చేసింది.   


logo