శుక్రవారం 05 జూన్ 2020
International - Apr 13, 2020 , 12:37:34

అమెరికాలో మే నెలలోనే నిబంధనల సడలింపు

అమెరికాలో మే నెలలోనే నిబంధనల సడలింపు

హైదరాబాద్: కరోనా కల్లోలంలో అమెరికా అత్యంత గడ్డు పరిస్థితులను ఎదుర్కుంటున్నది. అన్నిరకాల ఆర్థిక కార్యకలాపాలు స్తంభించిపోయాయి. వైరస్ వ్యాప్తి నిరోధానికి చర్చిలు కూడా ఆన్‌లైన్ విధానానికి మారిపోయాయి. రోజుకు రెండువేల మందికి పైగా మరణిస్తుండడంతో సామూహిక శవ ఖననాలు జరుగుతున్నాయి. మరి సాధారణ పరిస్థితులు నెలకొనేదెప్పుడు? ఈ ప్రశ్నకు అమెరికా అంటువ్యాధుల విభాగం అధిపతి ఆంథోనీ ఫాసీ ఇచ్చే సమాధానం మే నెలలో అని. ప్రస్తుతం పరాకాష్టకు చేరుకున్న కరోనా మహమ్మారి అప్పటికి శాంతించవచ్చని ఆయన అంచనా వేస్తున్నారు. ఈస్టర్ సండే కల్లా అమెరికాలో నిబంధనలు సడలించవచ్చని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆశించినప్పటికీ పరిస్థితి మరోలా ఉండడంతో దిగ్బంధనం కొనసాగించక తప్పలేదు. లాక్‌డౌన్ ఎత్తివేతపై తీసుకునేది తన హయాంలోని అత్యంత కీలక నిర్ణయం అవుతుందని ట్రంప్ అంటున్నారు. లాక్‌డౌన్ అనుకూల, వ్యతిరేక వత్తిళ్లతో ఆయన సతమతం అవుతున్నారు. దేశ సంక్షేమం కోసం ఆరోగ్య నిపుణులు లాక్‌డౌన్ కొనసాగించాలని అంటుంటే, ఆర్థిక వ్యవస్థను తక్షణమే పట్టాలెక్కించక తప్పదని వాణిజ్యవ్యాపార వర్గాలు, కొందరు కన్జర్వేటివ్ మిత్రులు మొండిగా వాదిస్తున్నారు. ఈ నేపథ్యంలో మే నెలలోనే కొన్ని రకాల నిబందనలు సడలించవచ్చని ఫాసీ సెలవిచ్చారు.


logo