మంగళవారం 22 సెప్టెంబర్ 2020
International - Aug 19, 2020 , 10:40:24

మారిషెస్‌లో ఇంధ‌నం లీక్.. భార‌తీయ కెప్టెన్ అరెస్టు

మారిషెస్‌లో ఇంధ‌నం లీక్.. భార‌తీయ కెప్టెన్ అరెస్టు

హైద‌రాబాద్‌: హిందూ మ‌హాస‌ముద్రంలో ఇటీవ‌ల ఇంధ‌నం లీకైన ఘ‌ట‌న తెలిసిందే. సుమారు వెయ్యి ట‌న్నుల ఇంధ‌నం లీక్ కావ‌డానికి కార‌ణ‌మైన భార‌తీయ కెప్టెన్‌ను మారిషెస్ అధికారులు అరెస్టు చేశారు. జపాన్‌కు చెందిన ఎంవీ వాకాషియో నౌక కెప్టెన్ సునిల్ కుమార్ నందేశ్వ‌ర్‌ను మారిషెస్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వ‌చ్చే వారం అత‌ని బెయిల్ విచార‌ణ ఉంటుంద‌ని పోలీసు ఇన్‌స్పెక్ట‌ర్ శివో కూత‌న్ తెలిపారు. నౌక‌కు చెందిన ఫ‌స్ట్ ఆఫీస‌ర్‌పైన కూడా కేసు న‌మోదు చేశారు. ఇంధ‌న నౌక‌లోని మొత్తం సిబ్బందిని ప్ర‌శ్నిస్తున్న‌ట్లు అధికారులు చెప్పారు. మారిషెస్‌లోని మ‌హేబోర్గ్ లాగూన్ దీవుల వ‌ద్ద పార్క్ చేసిన నౌక ఆగ‌స్టు 6వ తేదీన లీకేజ్ అయ్యింది. అయితే ఆ నౌక రెండుగా చీల‌క‌ముందే సుమారు 3వేల ట‌న్నుల ఇంధాన్ని పంపింగ్ చేశారు. కానీ లీకైన ఇంధ‌నం వ‌ల్ల కోర‌ల్ రీవ్స్‌కు న‌ష్టం వాటిల్లిన‌ట్లు ప‌ర్యావ‌ర‌ణ‌వేత్తలు చెబుతున్నారు. తీరం నుంచి క‌నీసం 10 మైళ్ల దూరంలో నౌక‌ను పార్క్ చేయ‌కుండా కేవ‌లం ఒక మైలు దూరంలో వాకాషియో పార్క్ చేశాడు. నౌక ఓన‌ర్ అయిన నాగ‌షికి షిప్పింగ్ సంస్థ దీనిపై విచార‌ణ చేప‌ట్టింది.logo