బుధవారం 03 జూన్ 2020
International - Apr 02, 2020 , 17:28:53

సామాజిక దూరం పాటిస్తూ విద్యార్థికి పాఠాలు..

సామాజిక దూరం పాటిస్తూ విద్యార్థికి పాఠాలు..

ఎక్క‌డో చైనాలో మొద‌లైన క‌రోనా వైరస్‌ అన్ని దేశాల‌ను చుట్టేస్తున్న‌ది. 70 దేశాల‌కు పైగా లాక్‌డౌన్ ప్రకటించాయి. దీంతో స్కూళ్లు, కాలేజీలు మాత్రం మూత వేయాల్సి వ‌చ్చింది. అయిన‌ప్ప‌టికీ స్టూడెంట్స్ చ‌దువుకు దూరం కాకూడ‌ద‌నే ఉద్దేశంతో కొందరు ఆన్‌లైన్ క్లాసులకు హాజరవుతుంటే మరి కొందరు సామాజిక దూరం పాటించి హోం టూషన్‌ పెట్టుకుంటున్నారు.  


క‌రోనా యుగంలో ఒక గ‌ణిత ఉపాధ్యాయుడు త‌మ శిష్యురాలికి గ‌ణితంలో ఉన్న సందేహం తీర్చ‌డానికి స్వ‌యంగా ఇంటికే వ‌చ్చేశాడు. కాక‌పోతే ఇంట్లోకి రాలేదు. ఇంటిముందే బోర్డు, మార్క‌ర్ ప‌ట్టుకొని ప్రాబ్ల‌మ్ సాల్వ్ చేశాడు. దానికి ఆ శిష్యురాలు ఇంట్లోని కిటికి వ‌ద్ద నిల‌బ‌డి అస‌క్తిగా విని అర్థం చేసుకుంటున్న‌ది. 12 ఏండ్ల శిష్యురాలి పేరు రిలీ అండ‌ర్స‌న్‌. ఉపాధ్యాయుని పేరు క్రిస్ వాబా. ఈ సంఘ‌ట‌ను రిలీ తండ్రి జోష్ అండ‌ర్స‌న్ ట్విట‌ర్‌లో పోస్ట్ చేశాడు. వాబా త‌మ ప‌క్కవీదికి చెందిన‌వాడు. ఈయ‌న‌ టీచ‌ర్ మాత్ర‌మే కాదు స్కూల్లో రెజ్లింగ్ కోచ్ కూడా. బాగా చ‌దువు చెబుతాడు. లాక్‌డౌన్ స‌మ‌యంలో కూడా సోష‌ల్ డిస్టెన్స్ పాటిస్తూ స్టూడెంట్స్ సందేహాలు తీరుస్తూ శ‌భాస్ అనిపించుకుంటున్నాడు . అత‌ను గొప్ప వ్య‌క్తే కాదు గొప్ప గ‌రువు కూడా అంటున్నాడు జోష్‌.


logo