మంగళవారం 22 సెప్టెంబర్ 2020
International - Aug 10, 2020 , 12:53:48

రోడ్డు మ‌ధ్య‌లో ఇల్లు.. అధికారులు ఎన్ని ఆఫ‌ర్లు ఇచ్చినా లొంగ‌ని మ‌హిళ‌!

రోడ్డు మ‌ధ్య‌లో ఇల్లు.. అధికారులు ఎన్ని ఆఫ‌ర్లు ఇచ్చినా లొంగ‌ని మ‌హిళ‌!

ప్ర‌భుత్వానికి వ్య‌తిరేఖంగా చాలామంది ఇల్లు నిర్మిస్తుంటారు. తీరా అధికారులు త‌నిఖీ చేసేట‌ప్పుడు తెలిస్తే ఇంటినే కూల్చేస్తారు. అలా కాకుండా వారి ఇండ్ల మీద‌గా ప్ర‌భుత్వం రోడ్డు వేయాల‌నుకుంటే.. ఇంటి య‌జ‌మానుల అనుమ‌తి త‌ప్ప‌నిస‌రిగా ఉండాలి. వారికోసం వేరే ఆఫ‌ర్లు ప్ర‌క‌టిస్తుంది ప్ర‌భుత్వం. ఉన్న‌దానిక‌న్నా ఎక్కువ వ‌స్తుంది అంటే ఎవ‌రు కాదంటారు. స‌రే అని చెప్పి ఒప్పుకుంటారు. రోడ్డు నిర్మాణానికి నీ ఇల్లు అడ్డుగా ఉంద‌ని అధికారులు ఎంత చెప్పినా ఓ మ‌హిళ మాత్రం అస‌లు ఒప్పుకోలేదు. దాంతో ఇంటికి ఇరువైపులా రోడ్డు నిర్మించేశారు అధికారులు.

ఈ సంఘ‌ట‌న చైనాలోని గౌవంగ్జూ న‌గ‌రంలో జ‌రిగింది. అక్క‌డ కొత్త‌గా హిజుయాంగ్ వంతెన‌ను ప్రారంభించారు. ఈ వంతెన క‌న్నా అక్క‌డున్న పాత ఇల్లే ప‌ర్యాట‌కుల‌ను ఆక‌ర్షిస్తుంది. ఇల్లు ఉన్న ప్రాంతంలో ప్ర‌భుత్వం వంతెన నిర్మించేందుకు ప్లాన్ చేసింది. అందుకోసం అక్క‌డున్న వారంద‌రికీ ప‌రిహారం ఇచ్చి ఇళ్ల‌ను ప‌డేశారు. కానీ అక్క‌డ నివ‌సించే లియాంగ్ అనే మ‌హిళ మాత్రం ఎన్ని ఆఫ‌ర్లు ఇచ్చిన ఆ ఇంటిని వ‌దులుకోలేదు. పైగా రూ. 2.15 కోట్లు, 4 ఫ్లాట్లు ఇవ్వాల‌ని డిమాండ్ చేసింది. వామ్మో ఇంత ఇచ్చేకోలేం అంటూ అధికారులు చేతులెత్తేశారు. దీంతో ఇంటిని అలానే వ‌దిలేసి అటువైపు, ఇటువైపు రోడ్డు వేసేశారు. రోడ్డు వ‌ల్ల ఆమె ఇంటికి ఎలాంటి ఇబ్బంది క‌లుగ‌కుండా కింద ఏర్పాటు చేశారు. వంతెన నిర్మాణం ఇంకా పూర్తి కాలేదు. దానికి ఇల్లు అడ్డుగా ఉంది. మ‌రోసారి ఆ మ‌హిళ‌ను సంప్ర‌దిస్తామంటున్నారు అధికారులు. ఈ ఇంటిని చూడాల‌నుకుంటే ఈ వీడియోలో చూసేయొచ్చు. logo