గురువారం 24 సెప్టెంబర్ 2020
International - Aug 31, 2020 , 01:56:33

రగులుతున్న అమెరికా

రగులుతున్న అమెరికా

  • మరో నల్లజాతీయుడి హత్యపై భారీ నిరసనలు

కేనోషా: అమెరికాలో పోలీసుల దాష్టీకాలకు వ్యతిరేకంగా నల్లజాతీయుల ఆందోళన కొనసాగుతూనే ఉన్నది. కెనోషాలో 23వ తేదీన జాకోబ్‌ బ్లేక్‌ అనే నల్లజాతీయుడిపై పోలీసులకు కాల్పులకు వ్యతిరేకంగా దాదాపు 700 మంది నల్లజాతీయులు ఆదివారం భారీ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో తెల్లజాతీయులు కూడా ఉన్నారు. బ్లేక్‌పై పోలీస్‌ అధికారి ఏడు రౌండ్లు కాల్పులు జరిపాడు. ఆ ఘటనకు ఏడు రోజులు పూర్తయిన సందర్భంగా ‘ఏడు బుల్లెట్లు.. ఏడు రోజులు’ అనే నినాదాలతో ఆందోళనకారులు హోరెత్తించారు. ‘న్యాయం జరుగనంతవరకు శాంతి ఉండదు’ అని నినదించారు.


logo