శనివారం 26 సెప్టెంబర్ 2020
International - Sep 17, 2020 , 12:45:12

భ‌వ‌నం కూలిన‌ట్లుగా ఓ 'ప‌ర్వ‌తం' కుంగిపోయింది.. క్ష‌ణాల్లో అదృశ్యం!

భ‌వ‌నం కూలిన‌ట్లుగా ఓ 'ప‌ర్వ‌తం' కుంగిపోయింది.. క్ష‌ణాల్లో అదృశ్యం!

పెద్ద బిల్డింగ్‌లు, వంతెన‌లు కూలిపోవ‌డం చూశాం గాని ఇలా ఓ ప‌ర్వ‌తం కుంగిపోవ‌డాన్ని చూడటం‌ ఇదే మొద‌టిసారి. ఈ సంఘ‌ట‌న ఎక్క‌డ చోటు చేసుకున్న‌దో కాని సోషల్ మీడియాలో మాత్రం తెగ వైర‌ల్ అయింది. సాధార‌ణంగా వ‌ర్షాల‌కు కొండ చ‌రియాలు విరిగి ప‌డుతుంటాయి. కానీ ఈ ప‌ర్వ‌తం మాత్రం విరిగి ప‌డేట‌ప్పుడు విప‌రీత‌మైన దుమ్ము లేచింది. ఆ దుమ్ము మేఘాల్లో క‌లిసిపోయిన‌ట్లు క‌నిపిచ్చింది. చూస్తుండ‌గానే క్ష‌ణాల్లో అక్క‌డున్న కొండ మాయ‌మైపోవ‌డంతో నెటిజ‌న్లు ఆశ్చ‌ర్య‌పోతున్నారు. ఇలాంటి దృశ్యాలు ఎప్పుడూ చూడ‌క‌పోయేస‌రికి నెటిజ‌న్లు బాగా ఆక‌ట్టుకున్న‌ది. మ‌రి ఈ ప‌ర్వ‌తం ఎందుకు కుంగిపోయిందో? అంటూ నెటిజ‌న్లు సందేహం వ్య‌క్తం చేస్తున్నారు. 


logo