బుధవారం 25 నవంబర్ 2020
International - Oct 28, 2020 , 20:17:10

ఈఫిల్ టవర్ కంటే ఎత్తైన పగడపు దిబ్బ.. ఎక్కడుందో తెలుసా?

ఈఫిల్ టవర్ కంటే ఎత్తైన పగడపు దిబ్బ.. ఎక్కడుందో తెలుసా?

ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు భారీ పగడపు దిబ్బను కనుగొన్నారు. ఇది ఎంపైర్ స్టేట్ భవనం, ఈఫిల్ టవర్‌, పెట్రోనాస్‌ ట్విన్‌ టవర్ల కంటే ఎక్కువ పొడవును కలిగి ఉన్నదంట. ప్రపంచంలోనే అతి ఎత్తైన భవనంగా నిలిచిన ఎంపైర్ స్టేట్ భవనం పొడవు 381 మీటర్లు కాగా.. కొత్తగా కనుగొన్న పగడపు దిబ్బ ఎత్తు 500 మీటర్లు అని శాస్త్రవేత్తలు తేల్చారు.

ఆస్ట్రేలియాలోని గ్రేట్ బారియర్ రీఫ్‌లో భారీ పగడపు దిబ్బను కనుగొన్నారు. నార్త్ క్వీన్స్‌లాండ్‌ వెలుపల ఉన్న నీటిలో 120 సంవత్సరాలకు ముందు మొదటిదానిఇక కనుగొన్నారు. పగడపు దిబ్బను ష్మిత్ ఓషన్ ఇన్‌స్టిట్యూట్ పరిశోధకులు ఫాల్కోర్ అనే పరిశోధనా నౌకలో ప్రయాణించారు. ఉత్తర గ్రేట్ బారియర్ రీఫ్ యొక్క సముద్రపు అడుగున మ్యాపింగ్‌ను శాస్త్రవేత్తలు పూర్తి చేసి, ఎనిమిది రోజుల క్రితం ఈ దిబ్బను కనుగొన్నారు. రీఫ్‌ను అన్వేషించడానికి సుబాస్టియన్ అనే రోబోట్‌ను ఈ బృందం ఉపయోగించింది. అన్వేషణ ఫుటేజ్ మొత్తం ప్రత్యక్ష ప్రసారం చేశారు. 1.5 కిలోమీటర్ల వెడల్పుతో.. 500 మీటర్ల ఎత్తుతో దిబ్బ ఉన్నట్లు గుర్తించారు. ఈ ప్రాంతంలో ఏడు ఇతర పొడవైన దిబ్బలు ఉన్నాయని, వీటిలో ఆకుపచ్చ తాబేళ్లు నివసించే రైన్ ఐలాండ్ దిబ్బలు కూడా ఉన్నట్లు పరిశోధకులు చెప్తున్నారు. ఈ ఆవిష్కరణను చూసి ఎంతో ఆశ్చర్యపోయానని యాత్రకు నాయకత్వం వహించిన రాబిన్ బీమన్ చెప్పారు. 3 డీ దిబ్బను వివరంగా మ్యాప్ చేయడమే కాకుండా, సుబాస్టియన్‌ రోబోతో ఈ ఆవిష్కరణను చూడటం కూడా నమ్మశక్యం లేదని తెలిపారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.