గురువారం 28 మే 2020
International - May 04, 2020 , 15:30:43

మాస్క్ ధ‌రిస్తేనే విమానం ఎక్కాలి..

మాస్క్ ధ‌రిస్తేనే విమానం ఎక్కాలి..హైద‌రాబాద్‌: అంత‌ర్జాతీయ విమానయాన సంస్థ‌లు క‌ఠిన ఆంక్ష‌లు అమ‌లు చేయ‌నున్నాయి.  ఇక నుంచి విమాన ప్ర‌యాణికులు క‌చ్చితంగా ముకానికి మాస్క్ ధ‌రించాల్సి ఉంటుంది. క‌రోనా వైర‌స్ వ్యాప్తిని అరిక‌ట్టేందుకు ఈ నియ‌మం త‌ప్ప‌దు.  ప్యాసింజెర్లతో పాటు క్యాబిన్ సిబ్బందికి కూడా ఈ నియ‌మావ‌ళి వ‌ర్తించే విధంగా అమెరికా విమాన సంస్థ‌లు కొత్త రూల్స్‌ను పాటించ‌నున్నాయి. ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఉన్న ఇత‌ర విమాన సంస్థ‌లు కూడా ఇలాంటి సూచ‌న‌లు త‌ప్ప‌నిస‌రి చేయ‌నున్న‌ది.  ప్ర‌స్తుతం ప్ర‌పంచ‌వ్యాప్తంగా 90 శాతం అంత‌ర్జాతీయ విమానాలు ర‌ద్దు అయ్యాయి. అయితే వ‌చ్చే నెల నుంచి విమాన రాక‌పోక‌లు ప్రారంభం అయ్యే సూచ‌న‌లు క‌నిపిస్తున్నాయి. దీంతో మాస్క్ రూల్‌ను అమ‌లు చేయాల‌ని ఆలోచిస్తున్నారు.  


logo