శుక్రవారం 18 సెప్టెంబర్ 2020
International - Aug 15, 2020 , 11:18:21

30 మంది కంటే ఎక్కువ‌మంది గుమిగూడితే రూ.3.14 లక్షలు జరిమానా! ఎక్క‌డో తెలుసా?

30 మంది కంటే ఎక్కువ‌మంది గుమిగూడితే రూ.3.14 లక్షలు జరిమానా! ఎక్క‌డో తెలుసా?

క‌రోనా వైర‌స్ నేప‌థ్యంలో ప్ర‌తిఒక్క‌రూ మాస్క్‌, సామాజిక దూరం, శానిటైజ‌ర్ త‌ప్ప‌నిస‌రిగా వాడాలి. లేదంటే ఇదివ‌ర‌కు ప‌నిష్‌మెంట్‌ విధించేవారు. కొన్నిరోజులుకు ఈ శిక్ష‌లు కూడా ప‌నిచేయ‌కుండా పోయాయి. ఆ త‌ర్వాత జ‌రిమానా విధించారు. 500, 1000 రూ. అయ్యేస‌రికి వాటిని క‌ట్టేందుకు అయినా మొగ్గుచూపుతున్నారు కాని మాస్కులు మాత్రం ధ‌రించ‌డం లేదు. అందుకే ఈ క‌ఠిన నిర్ణ‌యం తీసుకున్నారు అధికారులు. మాస్క్ పెట్టుకోకుండా ఎవ‌రైనా బ‌య‌ట క‌నిపిస్తే వారికి రూ. 3.14 ల‌క్ష‌లు జ‌రిమానా క‌ట్టాల‌ని ప్ర‌క‌టించారు. ఇంత‌కి ఇది ఎక్క‌డో తెలుసా? ఇక్క‌డ కాదులేండి. యూకేలో.

అక్క‌డ క‌రోనా కేసులు ఎక్కువ‌గా ఉండ‌డంతో షాపింగ్ మాల్స్‌, ప‌బ్లిక్ ట్రాన్స్‌పోర్ట్‌, మ్యూజియం వంటి త‌దిత‌ర ప్రాంతాల్లో మాస్క్ లేకుండా తిరిగితే వంద పౌండ్లు అంటే.. రూ. 9827 జ‌రిమానా విధించారు. ఈ డ‌బ్బును ఒక్క‌సారిగా క‌ట్టేస్తే 50 డాల‌ర్లు డిస్కౌంట్ కూడా ఇస్తార‌ట‌. అయితే ఇది ఇదివ‌ర‌కు ప‌రిస్థితి. ఈ జ‌రిమానాను లెక్క‌చేయ‌కుండా ప్ర‌జ‌లు విచ్చ‌విడిగా తిరుగుతుండ‌డంతో మ‌రో నిర్ణ‌యం తీసుకున్న‌ది యూకే ప్ర‌భుత్వం. అందుకే జ‌రిమానాను 3 వేల పౌండ్ల‌కు పెంచారు. అంటే మ‌న డబ్బులో సుమారు రూ. 3.14 ల‌క్ష‌లు అన్న‌మాట‌. అయితే పిల్ల‌లు, శారీర‌క‌, మాన‌సిక వైక‌ల్యంతో బాధ‌ప‌డేవారికి ఈ జ‌రిమానా నుంచి విముక్తి క‌ల్పించారు. అంతేకాదు అక్క‌డ జ‌రిగే ఏ వేడుక‌కైనా 30 మంది కంటే ఎక్కువ‌మంది గ‌నుక ఉంటే ఆ నిర్వాహ‌కుల‌కు 9.82 ల‌క్ష‌లు జ‌రిమానా విధిస్తున్నారు. ఇప్పుడు దీనిక‌న్నా మాస్క్ ధ‌రించ‌డమే బెట‌ర్ అంటున్నారు అక్క‌డ ప్ర‌జ‌లు. 


logo