ఆదివారం 25 అక్టోబర్ 2020
International - Oct 14, 2020 , 16:50:51

బ్లైండ్‌ఫోల్డ్‌లో కొబ్బరికాయలు పగులగొట్టి కొత్త గిన్నిస్‌ రికార్డ్‌

బ్లైండ్‌ఫోల్డ్‌లో కొబ్బరికాయలు పగులగొట్టి కొత్త గిన్నిస్‌ రికార్డ్‌

దేవుడి ముందు మామూలుగా కొబ్బరికాయ కొట్టాలంటేనే ఇప్పటితరం వారికి వీలుపడదు. ఆపసోపాలు పడుతుంటారు. రాయితో కొట్టడం, ఇనుపరాడ్‌తో కొట్టడం, నేలకేసి బాదడం వంటివి చేస్తుంటారు. అలాంటిది కళ్లు మూసుకుని కొట్టండి అంటే ఇంక అంతే సంగతులు. కొబ్బరికాయ పగలడం సంగతి దేవుడెరుగు.. పక్కనున్న వారి తల మాత్రం పగులుతుందని చెప్పొచ్చు.

ఆంధ్రకు చెందిన ఓ మార్షల్‌ ఆర్టిస్‌ తన విద్యార్థి చుట్టూ కొబ్బరికాయలు ఉంచి కళ్లకు గంతలు కట్టుకుని నిమిషంలో ఎక్కువ కాయలు పగులగొట్టి కొతత్ గిన్నిస్‌ రికార్డు సృష్టించాడు. గతంలో కరమ్‌జీత్‌సింగ్‌ అనే యువకుడు 35 కొబ్బరికాయలను ఇలాగే బ్లైండ్‌ఫోల్డ్‌లో పగులగొట్టి గిన్నిస్‌ రికార్డ్‌ నమోదుచేశాడు. ఈ రికార్డుపై కన్నేసిన మార్షల్‌ ఆర్ట్స్‌ మాస్టర్‌ పీ ప్రభాకర్‌ రెడ్డి.. ఇటీవలన తన శిష్యుడు బోయిల్లా రాకేశ్‌ను పడుకోబెట్టి ఆయన చుట్టూ కొబ్బరికాయలు పెట్టి కళ్లకు గంతలు కట్టుకుని పాత రికార్డను అధిగమించాడు. మొత్తం 49 కొబ్బరికాయలను పగులగొట్టి కొత్త రికార్డు తన పేరిట లిఖించుకున్నాడు. ఈ ఫీట్‌లో పగులగొట్టిన కొబ్బరి ముక్కలను వేస్ట్‌ చేయకుండా వాటిని జంతువులకు ఆహారంగా వేశారు. మీరూ ఆ వీడియోను చూసి ఆనందించండి!


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo