శుక్రవారం 25 సెప్టెంబర్ 2020
International - Aug 07, 2020 , 17:08:04

ఒక అమ్మాయికి ల‌వ్ ప్ర‌పోజ్ చేయ‌డానికి ఇంటినే త‌గ‌ల‌బెట్టేశాడు!

ఒక అమ్మాయికి ల‌వ్ ప్ర‌పోజ్ చేయ‌డానికి ఇంటినే త‌గ‌ల‌బెట్టేశాడు!

ల‌వ్ ప్ర‌పోజ‌ల్ అన‌గానే చీక‌టి.. క్యాండిల్స్ వెలుతురులో అమ్మాయి ఎదురుగా నిల‌బ‌డి, అబ్బాయి మోకాళ్ల మీద కూర్చొని ప్ర‌పోజ్ చేస్తున్న‌ట్టు ఊహించుకుంటాం. జీవితంలో ల‌వ్ ప్ర‌పోజ్ అంటూ చేస్తే ఇలానే చేయాలి అని భావిస్తారు అబ్బాయిలు. ఒక అబ్బాయి కూడా అలానే అనుకున్న‌ట్టు ఉన్నాడు. కానీ అంతా తారుమారైపోయింది. అస‌లు ఏం జ‌రిగిందో తెలిస్తే ఇలాంటి ఊహ‌ల‌న్నీ కొట్టిపారేస్తారేమో.. ఇంగ్లాండ్‌కు చెందిన ఒక అబ్బాయి త‌ను ప్రేమించిన అమ్మాయికి ల‌వ్ ప్ర‌పోజ్ చేద్దామ‌ని నిర్ణ‌యించుకున్నాడు. అనుకున్న విధంగానే ప్లాన్ చేసుకొని గ‌దికి తాళం వేసి అమ్మాయిని తీసుకురావ‌డానికి వెళ్లాడు. అమ్మాయికి ఆ మాటా ఈ మాటా చెప్పి ఇంటికి తీసుకొచ్చాడు. త‌లుపు తెరిచి చూసే స‌రికి అంతా నాశ‌నం.

పెద్ద పెద్ద మంట‌లు చెల‌రేగుతున్నాయి. దీంతో వెంట‌నే అగ్నిమాప‌క సిబ్బందికి ఫోన్ చేశాడు. వ‌చ్చి ఆ మంట‌లు ఆర్పేస‌రికి అక్క‌డంతా బూడిద అయిపోయింది. షార్ట్‌స‌ర్క్యూట్ జ‌రిగిందేమో అనుకున్నారు. అప్పుడే అస‌లు విష‌యం బ‌య‌ట‌ప‌డింది. 'ప్రియురాలిని స‌ర్‌ఫ్రైజ్ చేద్దామ‌ని గ‌దిలో 100 కొవ్వొత్తులు వెలిగించి ఆ త‌ర్వాత త‌లుపులు వేసి ఆమెకు తీసుకురావ‌డానికి వెళ్లాను. ఈలోపు ఇలా జ‌రిగింద‌ని' కూల్‌గా చెబుతున్నాడు. ఇది విని వారంతా ముక్కున వేలేసుకున్నారు. ఈ త‌ర్వాత ఈ సంఘ‌ట‌న‌ను సౌత్ యార్క్‌షైర్ ఫైర్ డిపార్టుమెంట్ సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశారు. 


logo