బుధవారం 03 జూన్ 2020
International - Apr 05, 2020 , 18:24:49

మర్కజ్ ఎఫెక్ట్: సౌతాఫ్రికాలో మౌల్వీ మృతి

మర్కజ్ ఎఫెక్ట్: సౌతాఫ్రికాలో మౌల్వీ మృతి

హైదరాబాద్: ఢిల్లీ మర్కజ్ మసీదు కరోనా ప్రకంపనలు దేశదేశాల్లో వినిపిస్తున్నాయి. తగ్లీబి జమాత్‌కు హాజరై మన తెలంగాణలోనే ఏడుగురి దాకా ప్రాణాలు కోల్పోయారు. తాజాగా సౌతాఫ్రికాలో మౌలానా యూసుఫ్ తూట్లా (80) అనే మౌల్వీ కరోనాతో పోరాడి మరణించారు. ఈయన మార్చి 1-15 తేదీల్లో ఢిల్లీ నిజాముద్దీన్ మసీదులో జరిగిన జమాత్‌కు హాజరై స్వదేశానికి తిరిగివచ్చారు. ఆ తర్వాత కరోనా వైరస్‌తో జబ్బుపడి గత మంగళవారం కన్నుమూశారని కుటుంబ సభ్యులు వెల్లడించారు. ఇస్లామిక్ ఖనన మండలికి ఆయన శవాన్ని ఓ బ్యాగులో పెట్టి ఇస్లామిక్ ఖనన మండలికి అందజేశారు. ఇండియా నుంచి తిరిగి వచ్చిన తర్వాత తూట్లకు ప్లూ తరహా లక్షణాలు మొదలయ్యాయి. ఫరీక్షలు జరుపగా కరోనా సోకినట్టు తేలింది. గతవారం చివరలో ఆయన కోలుకున్నట్టే కనిపించారు. కోనీ సోమవారం జబ్బు తిరగబెట్టింది. ఆ తర్వాత వేగంగా పరిస్థితి విషమించి ఆయన కన్నుమూశారు. భారత్ కు వెళ్లొద్దని ఎందరు వారించినా తూట్లా వినలేదని ఆయన కుటుంబసభ్యులు స్థానిక మీడియాకు తెలిపారు.


logo