గురువారం 24 సెప్టెంబర్ 2020
International - Sep 11, 2020 , 12:39:02

పాపం.. ఈ ఆకులు తింటే చ‌నిపోతుంద‌ని తెలియ‌క ప్రాణాలు కోల్పోయిన ఎలుక‌!

పాపం.. ఈ ఆకులు తింటే చ‌నిపోతుంద‌ని తెలియ‌క ప్రాణాలు కోల్పోయిన ఎలుక‌!

క‌నిపించిన ఆహారం తిని పారిపోవ‌డం ఎలుక నైజం. అవి తింటే ఆక‌లి తీరుతుంది అనుకుంటుందే కాని పాపం ప్రాణాలు కోల్పోతుంద‌ని ప‌సిగ‌ట్ట‌లేక‌పోయింది. ఆహారం కోసం గంజాయి పంట‌లోకే వేట‌కు వెళ్లింది చిట్టెలుక‌. రోజూ య‌‌జ‌మాని లేని స‌మ‌యంలో వెళ్లి గంజాయి ఆకులు తుంచుకొని తింటుండేది.

ప్ర‌తిరోజూ త‌మ పంట‌ను ఎవ‌రో పాడు చేస్తున్నార‌ని య‌జ‌మాని నిఘా పెట్టాడు. రెండు రోజులు ఇలానే తింటున్న‌ది ఎలుక‌. మూడోరోజుకి పాపం చిట్టెలుక అక్క‌డే ప్రాణాలు విడిచింది. ఈ సంఘ‌ట‌న కెన‌డా‌లోని న్యూ బ్రున్స్విక్‌లో చోటు చేసుకున్న‌ది. ఈ విష‌యాన్ని కొల్లిన్ సుల్లివ‌న్ త‌న ఫేస్‌బుక్ ఖాతాలో పోస్ట్ చేశారు. సాధార‌ణంగా గంజాయిని పెంచ‌డం చ‌ట్ట‌బద్దం.   


logo