ఆదివారం 31 మే 2020
International - Apr 16, 2020 , 16:06:44

ద‌క్షిణ‌కొరియా ఎన్నిక‌ల ఫ‌లితాల్లో రికార్డుల మోత‌!

ద‌క్షిణ‌కొరియా ఎన్నిక‌ల ఫ‌లితాల్లో రికార్డుల మోత‌!

న్యూఢిల్లీ: ద‌క్షిణ‌కొరియా జాతీయ అసెంబ్లీ (పార్ల‌మెంట్‌) ఎన్నిక‌ల ఫ‌లితాల్లో రికార్డుల మోత మోగింది. క‌రోనా భ‌యంతో ప్ర‌పంచ దేశాల‌న్నీ లాక్‌డౌన్‌లోకి వెళ్లిపోయాయి. దీంతో శ్రీలంక, యూకే, ఫ్రాన్స్‌, ఇథియోపియా సహా ప్రపంచవ్యాప్తంగా సుమారు 47 దేశాలు ఎన్నికలను వాయిదా వేసుకున్నాయి. కానీ, దక్షిణకొరియా మాత్రం లాక్‌డౌన్‌ను అమ‌లు చేస్తూనే బుధవారం పార్లమెంట్ ఎన్నికలకు పోలింగ్ నిర్వహించింది. లక్షల మంది ప్రజలు ముఖాల‌కు మాస్క్ లు ధరించి పోలింగ్‌స్టేష‌న్ల దగ్గర సోషల్ డిస్టెన్స్‌ను పాటిస్తూ ఓటింగ్‌లో పాల్గొన్నారు.


దీంతో కరోనా వైరస్ వ్యాప్తి తర్వాత ప్రపంచంలో పార్లమెంట్ ఎన్నికలు నిర్వ‌హించిన‌ తొలి దేశంగా దక్షిణకొరియా స‌రికొత్త రికార్డు నెల‌కొల్పింది. ఇక 1987లో దక్షిణకొరియా ప్రజాస్వామ్య దేశంగా మారినప్పటి నుంచి ఇప్పటివరకు జాతీయ అసెంబ్లీలో ఒక‌ పార్టీ ఇంతటి భారీ మెజారిటీ సాధించడం ఇదే మొదటిసారి. పై వాటితోపాటు మ‌రో రికార్డు కూడా ఈ ఎన్నికల్లో నమోదైంది. 1992 నుంచి దక్షిణకొరియాలో జరిగిన ఏ పార్లమెంటరీ ఎన్నికల్లో నమోదుకానంత‌ ఓటింగ్ శాతం ఈ ఎన్నిక‌ల్లో నమోదైంది. మొత్తం 66.2 శాతం మంది ద‌క్షిణ‌కొరియా ఓట‌ర్లు ఈ ఎన్నిక‌ల్లో ఓటు హ‌క్కు వినియోగించుకున్నారు. 

 


logo