మంగళవారం 01 డిసెంబర్ 2020
International - Oct 21, 2020 , 15:02:03

వీసా కోసం వెళ్తే.. తొక్కిస‌లాటలో 11 మంది మ‌హిళ‌లు మృతి

వీసా కోసం వెళ్తే.. తొక్కిస‌లాటలో 11 మంది మ‌హిళ‌లు మృతి

హైద‌రాబాద్: ఆఫ్ఘ‌నిస్థాన్‌లో ఇవాళ జ‌రిగిన తొక్కిస‌లాట‌లో 11 మంది మ‌హిళ‌లు మృతిచెందారు. ఓ స్టేడియంలో నిర్వ‌హించిన వీసా మేళాలో ఈ దుర్ఘ‌ట‌న జ‌రిగింది. పాకిస్థాన్‌కు వెళ్లేందుకు వీసా ద‌ర‌ఖాస్తులో భాగంగా వేలాది మంది ఒక్క‌సారిగా స్టేడియంకు వ‌చ్చారు.  దీంతో జ‌లాలాబాద్‌లోని వీసా సెంట‌ర్ నుంచి జ‌నాన్ని స్పోర్ట్స్ స్టేడియంకు త‌ర‌లించారు. క‌రోనా వల్ల ఏడు నెల‌లుగా నిలిచిపోయిన వీసా ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ మ‌ళ్లీ ఇవాళే మొద‌లైంది. ఈ నేప‌థ్యంలో భారీగా వ‌చ్చిన జ‌నం వ‌ల్ల తొక్కిస‌లాట చోటుచేసుకున్న‌ది.  కౌన్సులేట్ అధికారుల నుంచి టోక‌న్లు తీసుకునే క్ర‌మంలో జ‌నం ఎగ‌బ‌డ‌డం వ‌ల్ల తోపులాట జ‌రిగింది. ఈ ప్ర‌మాదంలో 11 మంది మ‌హిళ‌లు ప్రాణాలు కోల్పోయారు. మృతుల సంఖ్య ఎక్కువే ఉంటుంద‌ని అంచనా వేస్తున్నారు.