శుక్రవారం 15 జనవరి 2021
International - Nov 28, 2020 , 17:46:51

వ్యాక్సిన్ లేకుండానే చాలా దేశాలు క‌రోనాను క‌ట్టడి చేశాయి: డ‌బ్ల్యూహెచ్‌వో

వ్యాక్సిన్ లేకుండానే చాలా దేశాలు క‌రోనాను క‌ట్టడి చేశాయి: డ‌బ్ల్యూహెచ్‌వో

జెనీవా: ప‌్ర‌పంచంలోని చాలా దేశాలు వ్యాక్సిన్ లేకుండానే కొవిడ్-19ను నియంత్రించాయ‌ని ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) డైరెక్ట‌ర్ జ‌న‌ర‌ల్ టెడ్రోస్ అధానోమ్ ఘెబ్రెయెస‌స్ అన్నారు. ఈ మ‌హమ్మారితో అన్ని దేశాలు ప్ర‌భావిత‌మ‌య్యాయ‌ని, కానీ అన్ని దేశాలు ఒకే ర‌కంగా ప్ర‌భావితం కాలేద‌ని ఆయ‌న చెప్పారు. ప్ర‌స్తుతం అందుబాటులో ఉన్న వ‌న‌రుల‌తోనే కొవిడ్‌ను క‌ట్ట‌డి చేయ‌వ‌చ్చ‌ని చాలా దేశాలు నిరూపించాయ‌ని టెడ్రోస్ అన్నారు. అయితే అన్ని దేశాలూ  టెస్టింగ్ విష‌యంలో మాత్రం ముందున్నాయ‌ని ఆయ‌న తెలిపారు. ఈ మ‌హ‌మ్మారి ప్రారంభ‌మైన‌ప్ప‌టి నుంచీ డ‌బ్ల్యూహెచ్‌వో టెస్టులు ఎక్కువ‌గా చేయాల్సిందిగా సూచిస్తోంద‌ని, దీనికోసం అవ‌స‌ర‌మైన ప‌రికరాలు కూడా అందించామ‌ని ఆయ‌న చెప్పారు. ఇప్ప‌టి వ‌ర‌కు ఉన్న కేసులు, మ‌ర‌ణాల‌లో 50 శాతం కేవ‌లం నాలుగు దేశాల‌లోనే న‌మోద‌య్యాయ‌ని, 70 శాతం కేసులు, మ‌ర‌ణాలు టాప్ 10 దేశాల్లోనే ఉన్నాయ‌ని వెల్ల‌డించారు. ప్ర‌స్తుతం వ్యాక్సిన్‌లు అందుబాటులోకి వ‌స్తున్న త‌రుణంలోనూ టెస్టింగ్ అనేదే కీల‌క‌పాత్ర పోషించ‌నుంద‌ని టెడ్రోస్ స్ప‌ష్టం చేశారు.