బుధవారం 27 జనవరి 2021
International - Dec 30, 2020 , 17:09:54

చనిపోయిన ఈ పక్షి ప్రత్యేకతలు తెలుసా..!

చనిపోయిన ఈ పక్షి ప్రత్యేకతలు తెలుసా..!

అరుదైన తెలుపు కివి పక్షి చనిపోయింది. ల్యాబ్‌లో పొదిగిన మొట్టమొదటిదిగా గుర్తింపు ఉన్నది. న్యూజిలాండ్‌లో శస్త్రచికిత్స చేసిన తరువాత మరణించింది. మనుకురా అని పిలువబడే ఈ మంచు తెలుపు కివి పక్షి చనిపోవడంతో.. వన్యప్రాణుల సంరక్షణకారులలో తీవ్ర దుఃఖాన్ని మిగిల్చింది. మనుకురాను 2011 లో న్యూజిలాండ్ నార్త్ ఐలాండ్‌లోని పుకాహా నేషనల్ వైల్డ్ లైఫ్ సెంటర్లో పొదిగించారు. కివి పక్షులు సాధారణంగా గోధుమ రంగు ఈకలతో ఉంటాయి. లూసిజం అని పిలువబడే చాలా అరుదైన జన్యు లక్షణం ఫలితంగా తెలుపు రంగు కివి పక్షి జన్మించినట్లు నేషనల్‌ వైల్డ్‌ లైఫ్‌ సెంటర్‌ నిర్వాహకులు చెప్తున్నారు. ఈ అరుదైన కివి పక్షి చనిపోయిన విషయాన్ని వారు ఫేస్‌బుక్‌ వేదికగా వెల్లడిండాచు. "తమ ప్రియమైన స్నేహితుడు మనుకురను కోల్పోయినందుకు చాలా బాధతో ఉన్నం" అని పుకాహా నేషనల్ వైల్డ్ లైఫ్ సెంటర్ తెలిపింది.

గత కొన్ని రోజులుగా ఈ అరుదైన కివి పక్షి బరువు తగ్గుతుండటం, సరిగా తినడం లేదని రేంజర్లు గమనించి.. డిసెంబర్ నెల ఆరంభంలో వైల్డ్‌ బేస్ దవాఖానకు తరలించి చికిత్స అందించారు.

వైల్డ్‌బేస్ వెట్స్ ఒక వంధ్య గుడ్డును తొలగించడానికి పనిచేశాయి. అయితే, సహజంగా పాస్ చేయలేకపోయాయి. అప్పుడు దాని అండవాహికతోపాటు ఎడమ అండాశయాన్ని తొలగించడానికి శస్త్రచికిత్సలు అవసరమయ్యాయి. శస్త్రచికిత్సలు విజయవంతంగానే పూర్తయ్యాయి. కానీ, అనారోగ్యంతో ఉన్న కివిని కాపాడలేకపోయారు. ఆపరేషన్ తర్వాతి వారాల్లో కివి ఆరోగ్యం క్షీణిస్తూనే ఉన్నది. తుదకు డిసెంబర్ 27 మధ్యాహ్నం 12.50 గంటలకు కన్నుమూసిందని నేషనల్‌ వైల్డ్‌లైఫ్‌ సెంటర్‌ తెలిపింది. ఇలాంటి తెలుపు రంగు కివి పక్షలు చాలా అరుదుగా ఉంటాయి. కివీలు న్యూజిలాండ్‌కు చెందిన ఎగురలేని పక్షులు. ఈ పక్షులను న్యూజిలాండ్‌ దేశం తమ దేశ అధికార చిహ్నంగా గుర్తించింది.

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo