శనివారం 19 సెప్టెంబర్ 2020
International - Sep 01, 2020 , 16:34:10

నీలిరంగులోకి మారిన ప్రియురాలు.. ప్రియుడి పనే.!.. వీడియో వైరల్‌

నీలిరంగులోకి మారిన ప్రియురాలు.. ప్రియుడి పనే.!.. వీడియో వైరల్‌

హైదరాబాద్‌: బాత్‌టబ్‌లో స్నానం చేసి బయటకి వచ్చిన యువతి నీలంరంగులోకి మారిపోయింది. అచ్చం అవతార్‌ సినిమాలో క్యారెక్టర్‌లాగా కనిపించింది. ఆమె బాత్‌రూంలో నుంచి రావడం చూసిన ప్రియుడు ఒక్కసారిగా బిగ్గరగా నవ్వాడు. ఈ చిలిపి వీడియో ఫేస్‌బుక్‌, యూట్యూబ్‌లో పెట్టగా వైరల్‌ అయ్యింది. అయితే,  నెటిజన్ల నుంచి పెద్ద సంఖ్యలో విమర్శలు రావడం గమనార్హం.

ఈ ప్రాంక్‌ వీడియో చిత్రీకరించింది యూట్యూబర్‌ క్రిస్టెన్‌ హన్బీ. అతని ప్రియురాలు బాత్‌రూంలోకి వెళ్లకముందే టబ్‌లో ఫాబ్రిక్‌ డై పోశాడు. ఈ విషయం తెలియని అతడి ప్రియురాలు జాస్మిన్‌ వుడ్‌వర్డ్‌ స్నానం కోసం బాత్‌టబ్‌లోకి దిగింది. ఇంకేముంది దేహం మొత్తం నీలంరంగులోకి మారిపోయింది. దీన్ని వీడియో తీసిన హన్బీ తన యూట్యూబ్‌ చానల్‌తోపాటు ఫేస్‌బుక్‌లో పెట్టాడు. చాలామంది నెటిజన్లకు ఇది నచ్చలేదు. పాభ్రిక్‌ డై అనేది శరీరానికి హాని చేస్తుందని మండిపడ్డారు.  ఇది స్త్రీని కావాలని అవమానించినట్లుందని పలువురు కామెంట్లు పెట్టారు. ఇద్దరు కావాలనే ఈ ప్రాంక్‌ వీడియో చేశారని పలువురు వ్యాఖ్యానించారు

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo