శనివారం 26 సెప్టెంబర్ 2020
International - Aug 13, 2020 , 15:07:41

పెద్ద పొట్ట అతడి ఆయువు నిలిపింది..!వీడియో వైరల్‌

పెద్ద పొట్ట అతడి ఆయువు నిలిపింది..!వీడియో వైరల్‌

లువోయాంగ్: అధిక బరువు.. పెద్ద పొట్ట.. అనారోగ్యానికి దారితీస్తుందని మనకు తెలిసిందే. అందుకే వైద్యులు బరువు తగ్గించుకోమని సలహా ఇస్తుంటారు. అయితే, ఇవే ఒక మనిషి ప్రాణాన్ని కాపాడాయి. చైనీస్‌ వ్యక్తి జీవితంలో జరిగిన ఈ అపూర్వ సంఘటన సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నది. 

లియు అనే 28 ఏళ్ల చైనీస్‌ వ్యక్తి ఇంటి ఎదుట ఉన్న లోతైన బావిలో పడ్డాడు. అయితే, దాని ఉపరితలం ఇతడి బాడీ కంటే చిన్నగా ఉండడంతో అందులో పూర్తిగా పడిపోలేదు. అతడి పొట్ట అడ్డుగా రావడంతో పైనే ఆగిపోయాడు. అందులో ఇరుక్కుపోవడంతో కుటుంబ సభ్యులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారమందించారు. వారు వచ్చి అతడి నడుం చుట్టూ తాడు కట్టి పైకి లాగారు. ఈ వీడియోను ఫైర్‌ సిబ్బంది సోషల్‌ మీడియాలో పెట్టగా, భారీ స్పందన వస్తున్నది. బరువు ప్రమాదకరమని అందరూ అంటారు.. కానీ ఇలా ఉపయోగపడుతుందని ఎవరూ చెప్పరు అంటూ ఒకరు చమత్కరించారు. logo