గురువారం 02 ఏప్రిల్ 2020
International - Mar 03, 2020 , 00:58:15

ఉద్యోగం పోయి.. విచక్షణ కోల్పోయి..

ఉద్యోగం పోయి.. విచక్షణ కోల్పోయి..

మనీలా: ఓ సెక్యూరిటీ గార్డు తన ఉద్యోగం పోవడంతో విచక్షణ కోల్పోయాడు. తుపాకీతో ఒక షాపింగ్‌ మాల్‌లోకి చొరబడి కాల్పులు జరిపాడు. దీంతో ఒకరికి గాయాలయ్యాయి. ఆ తర్వాత మాల్‌లోని 30 మందిని నిర్బంధించాడు. ఈ ఘటన ఫిలిప్పీన్స్‌ రాజధాని మనీలాలో సోమవారం జరిగింది. పోలీసులు భారీగా చేరుకుని షాపింగ్‌ మాల్‌ చుట్టూ మోహరించారు. ఆ సెక్యూరిటీ గార్డును శాంతింపజేసేందుకు గంటల తరబడి వాకీటాకీల ద్వారా సంప్రదింపులు జరిపారు. చివరకు.. మీడియాతో మాట్లాడేందుకు అనుమతించాలంటూ అతడు పోలీసులకు షరతు విధించాడు. ముందుగా ఒప్పుకుంటామని చెప్పిన పోలీసులు.. అతడు బయటకు రాగానే అదుపులోకి తీసుకున్నారు. తనను వేధించి, ఉద్యోగం నుంచి తొలగించిన యాజమాన్యం క్షమాపణ చెప్పాలని కోరాడు.
logo