గురువారం 01 అక్టోబర్ 2020
International - Sep 09, 2020 , 14:10:45

మ్యాన్‌హోల్స్ ఇంత అందంగా ఉంటాయా! చూస్తే మ‌తి పోతుంది

మ్యాన్‌హోల్స్ ఇంత అందంగా ఉంటాయా! చూస్తే మ‌తి పోతుంది

మ్యాన్‌హోల్స్‌తో ఎప్పుడూ ప్ర‌మాద‌మే. న‌గ‌రాల్లో వ‌ర్షాలు ప‌డితే రోడ్డు మీద న‌డ‌వ‌డం క‌ష్ట‌త‌రం. మోకాళ్ల వ‌ర‌కు నీళ్లు చేర‌డంతో ఎక్క‌డ గుంత‌లున్నాయో ఎక్క‌డ మ్యాన్‌హోల్ ఉందో అర్థంకాక ప్ర‌మాదాల‌కు గురైనవాళ్లు చాలామందే ఉన్నారు. ఇవ‌న్నీ వ‌ర్షాలు ప‌డిన‌ప్పుడు. ప‌డ‌న‌ప్పుడు కూడా జ‌రుగుతుంటాయి. మ్యాన్‌హోల్ ఓపెన్‌లో ఉండ‌టం‌తో రాత్రులు చీక‌ట్లో న‌డిచేవాళ్లు, లైట్ లేని వాహ‌నాలు న‌డిపేవారు ఇబ్బందిప‌డుతుంటారు. వీట‌న్నింటినీ దృష్టిలో పెట్టుకొని జ‌పాన్ దేశం కొత్త‌గా మ్యాన్‌హోల్స్‌ను రూపొందించింది. వీటిని చూస్తే మ‌న‌సుపారేసుకుంటారు. అంత ‌బాగా డిజైన్ చేశారు.

టాకారోజ‌వా అనే న‌గ‌రంలో ఎల్ఈడీ లైట్ల‌తో మ్యాన్‌హోల్స్‌ను రూపొందించారు. జ‌పాన్‌లో పాపుల‌ర్ అయిన కార్టూన్ చిత్రాల‌ను మ్యాన్‌హోల్స్ మీద చిత్రీక‌రించారు. రాత్రి స‌మ‌యంలో వీటి మీదున్న ఎల్ఈడీ లైట్లు మెరుస్తుంటాయి. ఇవి ప‌గ‌లు సూర్య‌ర‌శ్మిని గ్ర‌హించి రాత్రులు వెలుతురినిస్తాయి. సాయంత్రం 5 గంట‌ల నుంచి తెల్ల‌వారుజామున 2 గంట‌ల వ‌ర‌కు వెలుగుతూ ఉంటాయి. మ‌రి జ‌పాన్ ప్ర‌జ‌ల‌ను ఆక‌ట్టుకునే మ్యాన్స్‌హోల్స్ మిమ్మ‌ల్ని ఆక‌ట్టుకుంటాయో లేదో చూడండి. 


logo