శనివారం 19 సెప్టెంబర్ 2020
International - Jul 12, 2020 , 01:43:45

తెరుచుకున్న డిస్నీ వరల్డ్‌

తెరుచుకున్న డిస్నీ వరల్డ్‌

ఓర్లాండో: అత్యద్భుత వినోదాలకు కేంద్రమైన అమెరికాలోని ఫ్లోరిడాలో ఉన్న డిస్నీ వరల్డ్‌ దాదాపు నాలుగు నెలల తర్వాత తిరిగి తెరుచుకున్నది. అందులోని మ్యాజిక్‌ కింగ్‌డమ్‌, యానిమల్‌ కింగ్‌డమ్‌ శనివారం తెరుచుకోగా, డిస్నీ హాలీవుడ్‌ స్టూడియోలు నాలుగు రోజుల తర్వాత తెరుచుకోనున్నాయి. డిస్నీ వరల్డ్‌లోకి ప్రవేశించాలంటే తప్పనిసరిగా మాస్క్‌ ధరించాల్సి ఉంటుంది. ఫ్లోరిడాలో గత కొన్ని రోజులుగా కరోనా విజృంభిస్తున్నప్పటికీ డిస్నీ వరల్డ్‌ను రీఓపెన్‌ చేయడం గమనార్హం. 


logo