సోమవారం 28 సెప్టెంబర్ 2020
International - Sep 08, 2020 , 08:02:41

ఉత్తర చైనాలో మంగోలుల నిరసనలు.. మాండరిన్‌లో బోధనతో బడులకు బంద్‌

ఉత్తర చైనాలో మంగోలుల నిరసనలు.. మాండరిన్‌లో బోధనతో బడులకు బంద్‌

బీజింగ్‌ : ఉత్తర చైనాలో ‘ఇన్నర్‌ మంగోలియా అటానమస్‌ రీజియన్‌'లోని మంగోలు జాతి ప్రజలు అక్కడ అమలు చేస్తున్న కొత్త విద్యావిధానంపై తీవ్ర నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం బోధనా భాషగా ఉన్న మంగోలియన్‌ స్థానంలో మాండరిన్‌ను ప్రవేశపెట్టడాన్ని వ్యతిరేకిస్తూ విద్యార్థులు బడులకు హాజరుకావడం లేదు. దీనికి పిల్లల తల్లిదండ్రులు మద్దతునిస్తున్నారు. తమ తెగ సంస్కృతి, భాషను అణచివేయడానికే అధికార కమ్యూనిస్టు పార్టీ ఈ నిర్ణయం తీసుకున్నదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంతకుముందు టిబెట్‌, జింజియాంగ్‌లో కూడా ఇలాంటి చర్యలే చేపట్టారని గుర్తు చేశారు. ఈ రీజియన్‌లో 42 లక్షల మందికి పైగా మంగోలు జాతి ప్రజలు ఉన్నారు. చైనాలో కమ్యూనిస్టు పార్టీకి వ్యతిరేకంగా నిరసనలు వ్యక్తం చేయడం చాలా అరుదు. అయినప్పటికీ మంగోలు తెగవారు భారీగా గుంపులు కూడి ఆందోళన తెలుపడం విశేషం. కాగా, మాండరిన్‌తో మంగోలులకు ఉద్యోగావకాశాలు పెరుగుతాయని అధికారులు చెప్తున్నారు.


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo