బుధవారం 30 సెప్టెంబర్ 2020
International - Sep 16, 2020 , 14:29:15

పామే అతడి మాస్క్‌.. వీడియో వైరల్‌!

పామే అతడి మాస్క్‌.. వీడియో వైరల్‌!

సాల్ఫోర్డ్: కరోనా నుంచి తప్పించుకోవడానికి మాస్కు తప్పనిసరిగా ధరించాలని అటు ప్రభుత్వాలు, ఇటు వైద్యనిపుణులు సూచిస్తూనే ఉన్నారు. చాలామంది ప్రజలు వీటిని వాడుతున్నారు. కొందరు విభిన్న తరహా మాస్కులతో ఆకట్టుకుంటున్న విషయం తెలిసిందే. సోషల్‌ మీడియాలో ఇప్పటిదాకా అలాంటి అనేక వీడియోలు చూశాం. కానీ ఈ ఇంగ్లాండ్‌ వ్యక్తి పామునే మాస్కుగా ధరించి అందరినీ ఆశ్చర్యపోయేలా చేశాడు. 

స్వింటన్ నుంచి మాంచెస్టర్ వెళ్లే బస్సులో ఓ వ్యక్తి ఎక్కాడు. మొదట అతడి మాస్కును చూసి అంతా పాము బొమ్మ ఉన్న వెరైటీ రకమేమో అనుకున్నారు. బస్సు కదిలిని కొద్దిసేపటికే పాము కదులుతుండడంతో చూసి సహప్రయాణికులు ఆశ్చర్యంతోపాటు ఆందోళన చెందారు. దీన్ని ఒకరు వీడియో తీసి, సోషల్‌ మీడియాలో పెట్టగా వైరల్‌ అవుతోంది.  

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo