శనివారం 24 అక్టోబర్ 2020
International - Oct 05, 2020 , 16:56:33

ముప్పెట్ ఫేస్‌మాస్క్‌.. ఇదోర‌కం మాస్క్‌!

ముప్పెట్ ఫేస్‌మాస్క్‌.. ఇదోర‌కం మాస్క్‌!

క‌రోనా వైర‌స్ నేప‌థ్యంలో ఎవ‌రిని వారు ర‌క్షించుకోవ‌డానికి అలాగే వైర‌స్ వ్యాప్తిని అరిక‌ట్టేందుకు మాస్క్ ధ‌రించ‌డం త‌ప్ప‌నిస‌రి. నిత్యం వాడే మాస్క్‌ల‌ను రొటీన్‌గా కాకుండా వెరైటీగా మార్చుకోవ‌డానికి ప్ర‌జ‌‌లు ఆస‌క్తి చూపుతున్నారు. ఈ నేప‌థ్యంలో వారి ముఖాన్ని మాస్క్‌గా ప్రింట్ చేపిస్తున్నారు. కొంత‌మంది మాస్క్ మీద ప్రేర‌ణాత్మ‌క కోట్స్ రాయ‌డం వంటి వినూత్న ఐడియాలు వేటినీ వ‌ద‌ల‌డం లేదు. వాటితో ప్ర‌తిరోజూ ఎంజాయ్ చేస్తున్నారు. ప్ర‌స్తుతం ముప్పెట్ ఫేస్‌మాస్క్ మాస్క్‌ ధ‌రించిన ఓ వ్య‌క్తి వీడియో వైర‌ల్‌గా మారింది. దీనిని సామ్ రో అనే వ్య‌క్తి ట్విట‌ర్‌లో షేర్ చేశారు. 19 సెకండ్ల నిడివి గ‌ల వీడియోలో ఒక వ్య‌క్తి న‌లుపు, ఎరుపు ముప్పెట్ ఫేస్‌మాస్క్ ధ‌రించి ఉన్నాడు. అత‌ను మాట్లాడే ప్ర‌తిసారి క‌దులుతున్న ముక్కుని చూడొచ్చు. ఈ మాస్క్‌కి నెటిజ‌న్లు ఫిదా అయ్యారు. 


logo