బుధవారం 23 సెప్టెంబర్ 2020
International - Aug 23, 2020 , 13:47:54

టీషర్ట్‌ మీద టీషర్ట్‌ 260 టీషర్టులేశాడు.. గిన్నిస్‌లోకెక్కాడు..!

టీషర్ట్‌ మీద టీషర్ట్‌ 260 టీషర్టులేశాడు.. గిన్నిస్‌లోకెక్కాడు..!

హైదరాబాద్‌: టీషర్ట్‌ మీద టీషర్ట్‌ ఏశాడు గిన్నిస్‌ రికార్డుల్లోకెక్కాడు టెడ్ హేస్టింగ్స్ అనే వ్యక్తి. మొత్తం 260 టీషర్టులను ఒకేసారి తన ఒంటిమీద వేసుకొని చరిత్ర సృష్టించాడు. నమ్మశక్యంకాని ఈ ఫీట్‌ 2019లో సాధించాడు. కాగా, ఇటీవల గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డ్స్‌ తమ ఇన్‌స్టా పేజీలో దీన్ని పోస్ట్‌ చేసింది.   

ఈ వీడియోలో హేస్టింగ్స్ ఒక్కో టీషర్ట్‌ వేసుకుంటుండగా, చుట్టూ ఉన్నవారు అతడికి సహాయం చేస్తున్నారు. మీడియం నుంచి  20 ఎక్స్ సైజు వరకు టీషర్టులను ఒక్కొక్కటీ వేసుకుంటుండగా అందరూ అరుస్తూ ప్రోత్సహించారు.  అనంతరం ఒక్కొక్కటీ విప్పుతూ లెక్కపెట్టారు. మొత్తం 260 కౌంట్‌ తేలగా, అతడి పేరును గిన్నిస్‌ బుక్‌లో నమోదు చేశారు. కాగా, తండ్రిపడే కష్టం పిళ్లలకు తెలియాలని ఈ ఫీట్‌ చేసినట్లు అతడు చెప్పాడు. దీని ద్వారా వచ్చిన డబ్బులను ఓ స్కూల్ ప్లే గ్రౌండ్‌ నిర్మాణానికి వాడతానని తెలిపాడు. ఈ వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో అందరినీ ఆకట్టుకుంటున్నది. చూసినవారంతా ఆశ్చర్యపోతున్నారు. 


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo