ఆదివారం 29 మార్చి 2020
International - Mar 19, 2020 , 13:53:35

ప్రజలపై ఆంక్షలు.. డైనోసార్‌ రూపంలో బయటకు..

ప్రజలపై ఆంక్షలు.. డైనోసార్‌ రూపంలో బయటకు..

కరోనాను కట్టడి చేసేందుకు ఆయా దేశాలు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నాయి. స్పెయిన్‌లో ప్రజలపై ఆంక్షలు విధించారు. ఏ ఒక్కరూ బయటకు రావొద్దని, స్వీయ నిర్బంధంలో ఉండాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. కేవలం పోలీసులు మాత్రమే రోడ్లపై పెట్రోలింగ్‌ చేస్తున్నారు. ఓ పెంపుడు జంతువుతో ఒక వ్యక్తి బయటకు వచ్చేందుకు అక్కడి ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది.

అయితే ఓ వ్యక్తి తన ఇంట్లో ఉన్న చెత్తను డస్ట్‌బిన్‌లో వేసేందుకు మంచి ప్లాన్‌ చేశాడు. డైనోసార్‌ వేషధారణలో రోడ్డు మీదకు వచ్చాడు. ఆ తర్వాత చెత్తను డస్ట్‌బిన్‌లో పడేశాడు. అయితే పోలీసులకు అనుమానం వచ్చి డైనోసార్‌ రూపంలో వ్యక్తిని అడ్డుకున్నారు. వ్యక్తిని మందలించి పోలీసులు అక్కడ్నుంచి పంపించారు. స్పెయిన్‌లో ఇప్పటి వరకు 13,716 కరోనా కేసులు నమోదు అయ్యాయి. ఈ వైరస్‌ బారిన పడి 558 మంది మృతి చెందారు.


logo