శుక్రవారం 30 అక్టోబర్ 2020
International - Oct 17, 2020 , 18:38:03

మొసలితో ఈత కొట్టాలనుకున్నాడు..కానీ..!

మొసలితో ఈత కొట్టాలనుకున్నాడు..కానీ..!

అసలు నీళ్లల్లో మొసలి ఉందంటేనే మనం అటువైపు వెళ్లం. కానీ, ఒకతను నీళ్లల్లో మొసలి కనిపించినా ఈతకొట్టేందుకు అందులో దిగాడు. ఇంకేముంది అది దగ్గరగా వచ్చి, కరవబోయింది. తృటిలో తప్పించుకున్నాడు..కానీ లేదంటే దానికి అతడు ఆహారమై ఉండేవాడు.

ఈ భయానక వీడియో ఇంటర్‌నెట్‌లో చక్కర్లు కొడుతోంది. దీన్ని చూసిన వారంతా అతడిపై తిట్ల దండకం అందుకుంటున్నారు. తొమ్మిది సెకన్ల నిడివిగల ఈ వీడియోను ఒకరు ట్విట్టర్‌లో షేర్‌ చేశారు. ఈ వీడియోలో వ్యక్తి మొసలి నోటికి అందినట్లే కనిపించాడు. కానీ తప్పించుకుని పడవెక్కాడు. బతుకు జీవుడా అంటూ అక్కడినుంచి వెళ్లిపోయాడు. మైక్రోబ్లాగింగ్‌ సైట్‌లో ఈ వీడియోకు 141 రీట్వీట్లు, 758 లైక్‌లు వచ్చాయి. లక్షకుపైగా మంది వీక్షించారు.  

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.