బుధవారం 21 అక్టోబర్ 2020
International - Oct 04, 2020 , 18:56:15

46 టాయిలెట్‌ రోల్స్‌ను నుదిటిపై నిలబెట్టాడు..!

46 టాయిలెట్‌ రోల్స్‌ను నుదిటిపై నిలబెట్టాడు..!

లండన్‌: అతడికి కొత్తకొత్త రికార్డులు సృష్టించడం అలవాటు. గిన్నిస్‌బుక్‌లో రికార్డులకోసం నిత్యం సాధన చేస్తుంటాడు. తాజాగా, 46 టాయిలెట్‌ రోల్స్‌ను నుదుటిపై పెట్టుకుని కిందపడకుండా కాసేపు అలాగే ఉండిపోయాడు. ఇంతకుముందు తనపేరుమీద ఉన్న గిన్నిస్‌ రికార్డును తానే బద్దలు కొట్టుకున్నాడు. ఈ ఫీట్‌ చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు.

బ్రిటన్‌కు చెందిన జే రావ్లింగ్స్‌కు ఇది కొత్తేమీ కాదు. ఇంతకుముందు ఇలాంటి ఫీట్స్‌ ఎన్నో చేశాడు. 11 కుర్చీలను తన గదవపై ఆపి రికార్డు సృష్టించాడు. ప్రస్తుతం ప్రఖ్యాత రికార్డ్-లిస్టింగ్ సంస్థ గిన్నిస్‌ వరల్డ్‌ బుక్‌ ఏర్పాటు చేసిన ‘జీడబ్ల్యూర్‌ చాలెంజ్‌’లో భాగంగా రావ్లింగ్స్‌ 46 టాయిలెట్‌ రోల్స్‌ను పడిపోకుండా నుదిటిపై ఉంచుకున్నాడు. ఇంతకుముందు 16టాయిలెట్‌ రోల్స్‌ను అలా ఉంచుకున్నాడు. కాగా, రావ్లింగ్స్‌ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డ్స్‌ కూడా ఈ ట్వీట్‌కు జీఐఎఫ్‌ రూపంలో కామెంట్‌ పెట్టింది. 

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo