బుధవారం 23 సెప్టెంబర్ 2020
International - Jul 12, 2020 , 15:50:09

తన గిన్నిస్ రికార్డును తానే బద్దలు కొట్టాడు

తన గిన్నిస్ రికార్డును తానే బద్దలు కొట్టాడు

అరిజోనా : గత కొన్ని నెలల లాక్డౌన్ నేపథ్యంలో ఒక్కొక్కరు ఒక్కోరకంగా సమయాన్ని సద్వినియోగం చేసుకున్నారు. కొందరు కొత్త వంటలను ఆవిష్కరించగా.. మరికొందరు తమలో దాగివున్న నైపుణ్యాన్ని వెలికితీసి పది మందికి పంచి శహబాష్ అనిపించుకున్నారు. ఇదే సందర్భంలో కొన్ని కొత్త గిన్నిస్ ప్రపంచ రికార్డులు సృష్టించబడ్డాయి. మరికొని పాత రికార్డులు బద్దలయ్యాయి.

అరిజోనాకు చెందిన పిమా అనే ఒక యువకుడు.. 485 జెంగా బ్లాక్‌లను ఒకే ముక్కపై పోగుచేసి కొత్త గిన్నిస్ రికార్డ్ సృష్టించాడు. అలా చేయడం ద్వారా తాను 2019 లో సాధించిన రికార్డును తానే బద్దలు కొట్టుకున్నాడు. గత ఏడాది ఈయన 353 బ్లాక్స్ తో రివర్స్ పిరమిడ్ నిర్మించాడు. తాయ్ స్టార్ వాలియంటి రివర్స్ పిరమిడ్ లాగా కనిపించే నిర్మాణాన్ని కేవలం రెండు గంటల్లోనే నిర్మించాడు. దీనిని గుర్తించిన గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ వారు ఆయన రికార్డును ఆయనే బద్దలుకొట్టాడని ధ్రువీకరణ పత్రం అందజేసి సత్కరించారు. జెంగా బ్లాక్స్ తో  రివర్స్ పిరమిడ్ తయారుచేస్తున్న వీడియోను మీరూ ఆస్వాదించండి.logo