ఆదివారం 20 సెప్టెంబర్ 2020
International - Aug 26, 2020 , 20:33:33

రూ.6.95 లక్షలు ఖ‌ర్చుపెట్టి కూల్‌డ్రింక్‌ను నేల‌పాలు చేశారు.. నాలుగేండ్ల శ్ర‌మ‌!

రూ.6.95 లక్షలు ఖ‌ర్చుపెట్టి కూల్‌డ్రింక్‌ను నేల‌పాలు చేశారు.. నాలుగేండ్ల శ్ర‌మ‌!

బిర్యాని అంటే ముందుగా కూల్‌డ్రింక్ ఉండాల్సిందే. పార్టీ అన‌గానే గ్లాసులో డ్రింక్ ప‌డాల్సిందే. బాడీ కొంచెం వేడెక్కింటే క‌డుపులోకి కూల్‌డ్రింక్ వెళ్లాల్సిందే. ఇలా చాలా సంద‌ర్భాల‌కు కూల్‌డ్రింక్‌ను వాడుతుంటారు. కూల్‌డ్రింక్ అంటే ఇష్ట‌ప‌డ‌ని వారే ఉండ‌రు. కానీ వీళ్లు మాత్రం ల‌క్ష‌లు ఖ‌ర్చుపెట్టి కూల్‌డ్రింక్‌ను నేల‌పాలు చేశారు. ఎందుక‌లా చేశారంటే ప్ర‌యోగం అంటున్నారు. దీనికి సంబంధించిన వీడియోను ఇప్పుడు నెట్టింట్లో చ‌క్క‌ర్లు కొడుతున్న‌ది. అంతేకాదు వీడియోను మిలియ‌న్ల‌కు పైగా వీక్షించార‌రు.   

రష్యాకు చెందిన ఓ యూట్యూబ్ బృందం ఇటీవల ఓ ప్రయోగం చేసింది. దీనిపేరు కోకా కోలా ఫౌంటేయిన్. మాక్సిమ్‌ మోనఖవ్‌ అనే యువకుడు రూ.6.95 లక్షలు పెట్టి  పదివేల లీటర్ల కోక్‌ను, బేకింగ్‌ సోడాను కొనుగోలు చేశాడు. త‌ర్వాత దాన్ని నిర్మానుష్యంగా ఉన్న పంట పొలాల్లోకి తరలించాడు. ఆ పొలాల్లో భారీ ఫౌంటెయిన్‌ను ఏర్పాటు చేశారు. ఇది చిచ్చుబుడ్డి రూపంలో ఉంటుంది. ఇందులో కోకాకోలాను నింపారు. ఆ త‌ర్వాత బేకింగ్ సోడాను క‌లిపిన వెంట‌నే అక్క‌డ నుంచి ప‌రార్ అయ్యారు. ఇంకేముంది కోకాకోలా మొత్తం పైకి కెర‌టాల్లా ఎగ‌సిప‌డింది. ఇదే ప్ర‌యోగం. దీనికోసం అత‌ను, త‌న ఫ్రెండ్స్ క‌లిసి నాలుగేండ్లు క‌ష్ట‌ప‌డ్డారు. ఇంత డ‌బ్బు వృథా చేయ‌డం క‌న్నా ఎవ‌రికైనా సాయం చేయొచ్చు క‌దా అని నెటిజ‌న్లు కామెంట్లు పెడుతున్నారు. ఏదేమైనా మీరు కూడా ఈ వీడియోను ఒక‌సారి చూసేయండి. logo