శుక్రవారం 25 సెప్టెంబర్ 2020
International - Aug 27, 2020 , 20:07:02

బాడీ మోడిఫికేషన్‌కు బానిస.. చెవులను తొలగించుకోబోతున్నాడు!

బాడీ మోడిఫికేషన్‌కు బానిస.. చెవులను తొలగించుకోబోతున్నాడు!

బెర్లిన్‌: శరీరాకృతిని మార్చుకోవడం ఒక వింత అభిరుచి. ఇది ఎన్నో దుష్ప్రభావాలకు దారితీస్తుందని తెలిసినా.. కొంతమంది తమ హాబీని మార్చుకోరు. ఇలాంటి కోవకు చెందినవాడే  సాండ్రో. బాడీ మోడిఫికేషన్‌కు ఇతను బానిస. అతడు తన శరీరంలో మార్పులు చేయించుకునేందుకు దాదాపు 6,000 డాలర్లు అంటే రూ. 5.8 లక్షలు ఖర్చు చేశాడు. తాజాగా, చెవులను తొలగించుకునేందుకు శస్త్రచికిత్సకు సిద్ధమై వార్తల్లో నిలిచాడు. 

ఈ  39 ఏళ్ల సాండ్రో జర్మనీలోని ఫిన్‌స్టర్వాల్‌డెయిన్ నివాసి. బాడీ మోడిఫికేషన్‌ అంటే ఇతడికి పిచ్చి. దీంతో నుదిటిపై, చేతి వెనుక భాగంలో, నాలుకలో మార్పులు చేయించుకున్నాడు. 2019 లో తన చెవులను తొలగించుకునేందుకు శస్త్రచికిత్సకు వెళ్లాడు. ఇప్పుడా సర్జరీ నడుస్తోంది. తన శరీర పరివర్తన తన జీవితాన్ని ప్రభావితం చేసిందని, దీనికి 'కూల్' గా కనిపించడానికి సంబంధం లేదని సాండ్రో చెప్పాడు. కాగా, ఇదేం వింతరోగమంటూ నెటిజన్లు అతడిపై మండిపడుతున్నారు.   


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo