బుధవారం 28 అక్టోబర్ 2020
International - Sep 30, 2020 , 15:17:16

డ్రైవ‌ర్ లేకుండానే దూసుకెళ్తున్న కారు : వీడియో వైర‌ల్‌

డ్రైవ‌ర్ లేకుండానే దూసుకెళ్తున్న కారు :  వీడియో వైర‌ల్‌

ప్ర‌పంచంలో అత్యంత ఖ‌రీదైన కార్ల‌లో టెస్లా కారు ఒక‌టి. ఇవి అద్భుత‌మైన టెక్నాల‌జీ ప్ర‌సిద్ది చెందింది. టెస్లా కారుకు సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు వైర‌ల్‌గా మారింది. టెస్లా కారులో ఓ వ్య‌క్తి ప్ర‌యాణికుల సీట్లో కూర్చొని ఉన్నాడు. డ్రైవ‌ర్ సీట్లో ఎవ‌రు లేకుండానే కారు మాత్రం వేగంగా దూసుకుపోతుంది. ఎదెలా సాధ్యం అనుకుంటున్నారా? అత‌ను కారు ఆటోపైల‌ట్ ఫీచ‌ర్‌ను కంట్రోల్ చేస్తూ నార్త్ క‌రోలినాలోని ఒక ర‌హ‌దారిపై ప్ర‌యాణించాడు. ఏదేమైనా ఈ కారు భ‌లే ఉంది.

వీడియోలో చూసిన‌ట్ల‌యితే య‌జ‌మాని మాత్రం ప్యాసింజ‌ర్ సీట్లో హాయిగా కూర్చొని ఉన్నాడు. ప‌క్క‌నే వాహ‌నాలు దూసుకుపోతున్నాయి. అయితే, ఎవరైనా డ్రైవర్ సీట్లో కూర్చున్నప్పుడు మాత్రమే టెస్లా తమ కార్లలో ఆటోపైలట్ ఫీచర్‌ను ఉపయోగించమని సిఫారసు చేసింది. 'ప్రస్తుతం ఆటోపైలట్ ఫీచర్‌కు యాక్టివ్ డ్రైవర్ పర్యవేక్షణ అవసరం' అని టెస్లా కంపెనీ స్పష్టంగా పేర్కొంది. ఆటోపైలట్ ఫీచర్ కారణంగా గతంలో చాలా టెస్లా కార్లు యాక్సిడెంట్‌కు గుర‌య్యాయ‌నే సూచ‌న‌లు ఇస్తున్నారు. logo