కరచాలనం చేయబోగా ఆగంతకుడి దాడి
పారిస్, జూన్ 8: ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్ మాక్రాన్‌కు చేదు అనుభవం ఎదురైంది. ఓ వ్యక్తి మాక్రాన్ చెంపపగులగొట్టాడు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. దేశవ్యాప్త పర్యటనలో భాగంగా మాక్రాన్ మంగళవారం ఆగ్నేయ ఫ్రాన్స్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా టైన్ ఎల్ హెర్మిటేజ్ గ్రామంలోని ఉన్నతపాఠశాలను సందర్శించి తన కారు దగ్గరకు వెళ్లారు. అయితే సందర్శకులు పిలువడంతో అక్కడి నుంచి వెనక్కి వచ్చి వారిని పలుకరించారు. ఈ క్రమంలో ఓ వ్యక్తికి షేక్‌హ్యాండ్ ఇవ్వగా, అతడు మాక్రాన్ చెంపపై గట్టిగా కొట్టాడు. దీంతో అక్కడున్న వారంతా షాక్‌కు గురయ్యారు. అప్రమత్తమైన సెక్యూరిటీ సిబ్బంది నిందితుడితో పాటు మరొకరిని అదుపులోకి తీసుకున్నారు. వచ్చే ఏడాది జరిగే అధ్యక్ష ఎన్నికల్లో మాక్రాన్ మరోసారి పోటీ చేయనున్నారు. ప్రత్యర్థికంటే ఆయన స్వల్ప ముందంజలో ఉన్నట్టు అంచనాలు వెలువడతున్నాయి. ఈ క్రమంలోనే ఆయన దేశవ్యాప్త పర్యటన చేస్తున్నారు.