సోమవారం 30 మార్చి 2020
International - Feb 03, 2020 , 02:04:21

లండన్‌లో ఉగ్రదాడి

లండన్‌లో ఉగ్రదాడి
  • పలువుర్ని కత్తితో పొడిచిన ఉగ్రవాది..
  • కాల్చి చంపిన పోలీసులు

లండన్‌, ఫిబ్రవరి 2: లండన్‌లో ఉగ్రవాది బీభత్సం సృష్టించాడు. పలువురిపై విచక్షణా రహితంగా కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో కనీసం ముగ్గురు గాయపడ్డారు. దీంతో ఉగ్రవాదిని పోలీసులు కాల్చివేశారు. ఈ ఘటన దక్షిణ లండన్‌లోని స్ట్రేథవ్‌ు హై రోడ్డులో ఆదివారం జరిగింది. ఘటన జరిగేకంటే ముందు ఉగ్రవాది పలువురిపై కత్తితో దాడిచేయగా కనీసం ముగ్గురికి గాయాలయ్యాయని, వెంటనే అప్రమత్తమైన పోలీసులు నిందితున్ని కాల్చి చంపారని అధికారులు తెలిపారు. ఉగ్రవాది ఈ చర్యకు పాల్పడటానికి గల కారణాలు తెలియాల్సి ఉన్నదన్నారు. ఘటనాస్థలికి చేరుకున్న సహాయక బృందాలు.. గాయపడిన ముగ్గురిని హుటాహుటిన సమీప దవాఖానకు తరలించారు. ఘటన నేపథ్యంలో పోలీసులు స్థానిక దుకాణాలను మూసివేశారు. ఘటనపై ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ స్పందించారు. ఘటన జరిగిన వెంటనే సంఘటనాస్థలానికి చేరుకున్న అత్యవసర సేవల విభాగాన్ని ఈ సందర్భంగా ప్రశంసించారు. గాయపడిన బాధితులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. 


logo