గురువారం 28 మే 2020
International - May 20, 2020 , 12:26:35

జూమ్‌కాల్‌తో విచార‌ణ‌.. నిందితుడికి మ‌ర‌ణ‌శిక్ష‌

జూమ్‌కాల్‌తో విచార‌ణ‌.. నిందితుడికి మ‌ర‌ణ‌శిక్ష‌


హైద‌రాబాద్‌: సింగ‌పూర్ సుప్రీంకోర్టు ఓ డ్ర‌గ్ స్మ‌గ్ల‌ర్‌కు మ‌ర‌ణ‌శిక్ష‌ను విధించింది. అయితే జూమ్‌కాల్ ద్వారా విచార‌ణ నిర్వ‌హించిన కోర్టు.. నిందితుడికి మ‌ర‌ణ‌శిక్ష‌ను ఖ‌రారు చేయ‌డం ఇదే తొలిసారి. మ‌లేషియాకు చెందిన 37 ఏల్ల పునీత‌న్ గ‌నేశ‌న్ అనే వ్య‌క్తి 2011లో హెరాయిన్ స‌ర‌ఫ‌రా చేశాడు. ఆ కేసులో సుప్రీం విచార‌ణ సాగింది. క‌రోనా వైర‌స్ వ‌ల్ల ఏర్ప‌డిన లాక్‌డౌన్ కార‌ణంగా..  దేశంలోని కోర్టుల‌న్నీ మూత‌ప‌డ్డాయి. కొన్ని కోర్టులు మాత్రం వీడియోకాలింగ్‌తో కేసుల‌ను ప‌రిష్క‌రిస్తున్నాయి. అలాగే స్మ‌గ్ల‌ర్ పునీత‌న్ కేసును కూడా విచారించిన కోర్టు.. నిందితుడికి మ‌ర‌ణ‌శిక్ష‌ను ఖ‌రారు చేస్తూ తీర్పునిచ్చింది. జూమ్‌కాల్ ద్వారా తీర్పు విన్నానని, దీనిపై అపీల్‌కు వెళ్ల‌నున్న‌ట్లు పునీత‌న్ త‌ర‌పు న్యాయ‌వాది తెలిపారు.   


logo