గురువారం 01 అక్టోబర్ 2020
International - Aug 18, 2020 , 12:03:07

క‌రెంట్ షాక్ కొట్టిన వ్య‌క్తిని చాక‌చ‌క్యంగా కాపాడిన వ్య‌క్తి.. ఇలా కూడా కాపాడొచ్చా!

క‌రెంట్ షాక్ కొట్టిన వ్య‌క్తిని చాక‌చ‌క్యంగా కాపాడిన వ్య‌క్తి.. ఇలా కూడా కాపాడొచ్చా!

మ‌న‌కు క‌రెంట్ షాక్ కొట్టిన‌ప్పుడు ఏం చేయ‌లేని ప‌రిస్థితి. అదే ఎదుటివారికి షాక్ కొడితే కొన్ని ప్ర‌య‌త్నాలు చేసి కాపాడుకోవ‌చ్చు. కానీ ఆ స‌మ‌యంలో ఎలా కాపాడాలో బుర్ర‌కు ఏం త‌ట్ట‌దు. కానీ ఇత‌ను మాత్రం ఎంతో స‌మ‌య‌స్పూర్తితో క‌రెంట్ షాక్‌కు గురైన త‌న ఫ్రెండ్‌ను కాపాడుకున్నాడు.

పాకిస్తాన్‌కు చెందిన ఓ వ్య‌క్తి షాపు ష‌ట్ట‌ర్ మూస్తున్న స‌మ‌యంలో క‌రెంట్ షాక్‌కు గుర‌య్యాడు. అత‌న్ని కాపాడే ప్ర‌య‌త్నంలో ప‌క్క‌నే ఉన్న వ్య‌క్తికి ఏం చేయాలో అర్థం కాలేదు. ప‌క్క‌న‌ ఎలాంటి వ‌స్తువులు కూడా లేవు. ఉన్నా కూడా వాటికి క‌రెంట్ వ‌చ్చే అవకాశం ఎక్కువ‌గా ఉంటుంది. అందుక‌నే వంటి మీద ఉండే కండువ‌తోనే వ్య‌క్తిని ప‌ట్టుకుని కింద ప‌డేశాడు. ఆ త‌ర్వాత కేక‌లు వేయడంతో స్థానికులు హుటాహుటిన వ‌చ్చి బాధితుడిని హాస్పిట‌ల్‌కు త‌ర‌లించారు. logo