శుక్రవారం 18 సెప్టెంబర్ 2020
International - Aug 28, 2020 , 16:46:44

20 ఏండ్ల కింద‌ట పోయిన ప‌ర్సు.. ఇప్పుడు చూసి షాక్ అయ్యారు!

20 ఏండ్ల కింద‌ట పోయిన ప‌ర్సు.. ఇప్పుడు చూసి షాక్ అయ్యారు!

ఈ రోజుల్లో ఏదైనా వ‌స్తువు పోతే దాని మీద ఆశ‌లు వ‌దులుకోవ‌డమే బెట‌ర్ అంటున్నారు. అలాంటిది 20 ఏండ్ల క్రితం పోగోట్టుకున్న ప‌ర్సు దొరికే స‌రికి అత‌ని ఆనందానికి అవ‌ధుల్లేవు. ఇంత‌కీ ఆ ప‌ర్సులో ఏముందే తెలుసా. కేవ‌లం ఏటీఎం కార్డులు, కొన్ని కాగితాలు త‌ప్ప మ‌రేం విలువైన వ‌స్తువులు లేవు. విలువైన వ‌స్తువులు ఉన్నా లేకున్నా పోయిన వ‌స్తువు దొరికితే ఆ ఆనంద‌మే వేరు అంటున్నాడు ఆ వ్య‌క్తి.

ఈ మ‌ధ్య డ‌బ్లిన్ పోలీసుల‌కు భూమిలో కూరుకుపోయిన ఓ ప‌ర్సు క‌నిపించింది. అందులోని ఆధాల‌ను బేస్ చేసుకొని వ్య‌క్తి వివ‌రాలు సేక‌రించారు. ప‌ర్సు గ‌ల వ్య‌క్తికి చెప్ప‌గా ఇది నాదే అని వాపోయాడు. అంతేకాదు ఆ ప‌ర్సును 20 కింద‌ట ఒక దొంగ దొంగిలించాడ‌ని చెప్పాడు. అందులోని డ‌బ్బును తీసుకొని ఆ ప‌ర్సును అక్క‌డే పాతిపెట్టి ఉంటాడుట‌ని పోలీసులు పేర్కొన్నారు. 20 ఏండ్ల క్రితం సంఘ‌ట‌న‌ను 24 గంట‌ల్లో ఛేదించాం అని ఫ‌న్నీగా ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశారు. ఇది కాస్త వైర‌ల్‌గా మారింది. ఇలాంటి సంఘ‌ట‌న‌లు ఇంత‌కుముందు రెండు మూడు చోటు చేసుకున్నాయి.  


logo