బుధవారం 28 అక్టోబర్ 2020
International - Sep 24, 2020 , 20:13:56

ఇతగాడు 'మానవ సైతాను'గా మారాడు..

ఇతగాడు 'మానవ సైతాను'గా మారాడు..

ఇటీవలి కాలంలో మేక్ఓవర్ తీవ్ర రూపాలు దాల్చుతున్నది. తరచుగా శరీర సవరణ ఔత్సాహికులకు సంతోషంగా ఉండగా.. చూసేవారికి దిగ్భ్రాంతికి గురిచేస్తుంది. శరీర మార్పులతో సంబంధం ఉన్న ఎన్నో నష్టాలు ఉన్నప్పటికీ చాలా మంది వ్యక్తులు దీనిని తమ అభిరుచిగా మార్చుకుంటున్నారు. 

44 ఏళ్ల బ్రెజిలియన్ మిచెల్ ఫారో డో ప్రాడో అటువంటి తీవ్రమైన శరీర మార్పునకు ఉత్సాహం చూపాడు. ఫారో ఇప్పటికే తల ఇంప్లాంట్లు, మార్పు చేసిన దంతాలు, డజన్ల కొద్దీ కుట్లు, ఒంటినిండా పచ్చబొట్లు కలిగివున్నాడు. అయితే అతడి తాజా మార్పును చూసినవారు షాకింగ్‌కు గురవ్వడం ఖాయం. 'మానవ సైతాను' రూపాన్ని మెరుగుపరిచుకునేందుకు శస్త్రచికిత్స ద్వారా ముక్కులో కొంత భాగాన్ని తొలగించుకున్నాడు. ఇంత వింత  ప్రక్రియకు గురైన ప్రపంచంలోనే మూడో వ్యక్తిగా రికార్డులకెక్కాడు. మిచెల్ ఫారో నిజానికి పచ్చబొట్టు కళాకారుడు. మిచెల్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో తన శరీర పరివర్తన ఫొటోలను పంచుకుంటాడు. ఇలాఉండగా, జర్మనీలోని ఫిన్‌స్టర్‌వాల్‌డెయిన్‌కు చెందిన 39 ఏళ్ల వ్యక్తి తన నుదిటిపై, చేతి వెనుక భాగంలో, నాలుకలో మార్పులకు అనేక సర్జరీలు చేయించుకున్నాడు. 2019 లో చెవిని తొలగించుకున్నాడు. logo