గురువారం 09 జూలై 2020
International - May 29, 2020 , 14:34:26

ఎనిమిదేండ్ల కిందట ఆర్డర్‌ చేస్తే ఇప్పుడు వచ్చింది! ప్రాడక్ట్ ఎలా ఉందంటే..

ఎనిమిదేండ్ల కిందట ఆర్డర్‌ చేస్తే ఇప్పుడు వచ్చింది! ప్రాడక్ట్ ఎలా ఉందంటే..

నిద్రలేచి తలుపు తెరిచేసరికి ఇంటి ముందు ఒక పార్శిల్‌ ఉంది. ఇరుగుపొరుగు వారిదేమో అనుకున్నాడు. అడ్రస్‌ చూస్తే.. ఊరు, పేరు, ఫోన్‌ నెంబర్‌ ఇతనిదే ఉంది. ఆశ్చర్యపోయాడు. ఎంత ఆలోచించినా ఆర్డర్‌ చేసినట్లు గుర్తురాలేదు. ఈ ఆర్డర్‌ ఇప్పటిది కాదు. ఎనిమిదేండ్ల క్రితంది.

టొరంటోకు చెందిన డాక్టర్‌ ఎల్లియాట్‌ బెరిన్‌స్టేయిన్‌కు ఎదురైన చేదు అనుభవం ఇది. 2012లో అతను well.ca ద్వారా ఓ హెయిర్‌ క్రీమ్‌ను ఆర్డర్‌ చేశాడు. దీంతో ఆ సంస్థ కెనడా పోస్టు ద్వారా ప్రొడక్ట్‌ను పంపింది. అయితే, కెనడా పోస్టు దాన్ని వెంటనే అతనికి డెలివరీ చేయలేదు. ఏ సమస్య వచ్చిందో ఏమో వారి వద్దే ఆగిపోయింది. ఇటీవల డాక్టర్‌కు డెలివరీ చేసి చేతులు దులిపేసుకున్నారు. సాధారణంగా ఈ క్రీమ్‌ తెలుపు రంగులో ఉండాలి. ఇక్స్‌పైరీ అయిపోవడంతో పసుపు రంగులోకి మారింది. ‘పార్శిల్ డెలివరీ చేయకుండా వదిలేసిన ఈ ప్రాడక్ట్‌ను ఇంన్నేండ్ల తర్వాత నాకు ఎందుకు పంపారో అర్థం కావడం లేదు’ అంటూ ఆ ప్రాడక్ట్‌ సంస్థ, డెలివరీ సంస్థలను లింక్‌ చేశాడు. దీనిపై ప్రాడక్ట్‌ సంస్థ క్షమాపణలు తెలియజేసింది.logo