శనివారం 26 సెప్టెంబర్ 2020
International - Sep 09, 2020 , 18:18:42

ఇలా చేస్తే దొంగలు మీ బైక్‌ను ముట్టమన్నా ముట్టరట!

ఇలా చేస్తే దొంగలు మీ బైక్‌ను ముట్టమన్నా ముట్టరట!

టోక్యో: ప్రపంచంలోని అనేక నగరాల్లో ద్విచక్ర వాహన చోరీలు పెరుగుతున్నాయి. ఇది యజమానులకు బాధ కలిగించడమే కాకుండా, పోలీసులకు నిద్రలేకుండా చేస్తోంది. ఎన్ని చర్యలు తీసుకున్నా బైక్,  స్కూటర్ దొంగతనాలు నిరంతరాయంగా కొనసాగుతున్నాయి. దీంతో జపాన్‌కు చెందిన ఓ వ్యక్తి వినూత్నంగా ఆలోచించాడు. పిట్టరెట్ట వేసిన బైకులను ఎవరూ ముట్టుకోవడం లేదని గుర్తించి, అలాంటి స్టిక్కర్స్‌ తయారుచేసి, ఇన్నోవేషన్‌ అవార్డును సొంతం చేసుకున్నాడు. 

జపాన్‌లో ప్రతి 15 నిమిషాలకు ఒక ద్విచక్ర వాహనం దొంగిలించబడింది. ఆశ్చర్యకరంగా, 2018 లో 35,395 బైక్‌లు దొంగిలించబడ్డాయి, వాటిలో 42% సరిగా లాక్ చేసినా దొంగలు ఎత్తుకెళ్లారు. ఇది గమనించిన జపాన్‌కు చెందిన 29 ఏళ్ల మోటోకి బైక్‌లు దొంగతనానికి గురికాకుండా ఒక ప్రత్యేకమైన మార్గాన్ని కనుగొన్నాడు. ద్విచక్ర వాహనాల సీట్లపై ఉంచేందుకు పిట్టరెట్ట (బర్డ్‌పూప్‌)ను పోలిన స్టిక్కర్లను తయారుచేశాడు. అన్‌లాక్ చేసిన 1,000 బైక్‌లపై ఈ స్టిక్కర్లను ఉంచాడు. ఐదురోజుల తర్వాత చూస్తే ఈ స్టిక్కర్లు ఉన్న ఒక్క బైక్‌ను కూడా దొంగలు ముట్టుకోలేదట. ఇప్పుడు, అతడి తెలివైన ఆవిష్కరణకు 4,50,000 జేపీవై క్రౌడ్ ఫండింగ్ లభించింది. రాబోయే రోజుల్లో ఎక్కువ నిధులు అందుతాయని భావిస్తున్నారు.

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo