బుధవారం 21 అక్టోబర్ 2020
International - Sep 17, 2020 , 19:18:41

భారీ మొసలి.. అతడు చెప్పిన మాట వింటోంది..!

భారీ మొసలి.. అతడు చెప్పిన మాట వింటోంది..!

కాన్‌బెర్రా: సాధారణంగా ఇంట్లో పెంపుడు జంతువులు మనం చెప్పిన మాట వింటాయి. మరి అడవిలో ఉండే క్రూర జంతువులు వింటాయా? సరీసృపాలు ఇక్కడినుంచి పో అని మనం బెదిరిస్తే పోతాయా? కానీ, ఆస్ట్రేలియాకు చెందిన ఓ వ్యక్తి బెదిరిస్తే మొసలి వింటోంది మరీ. కాలువలో పనిచేస్తుండగా దగ్గరకు వచ్చిన మొసలి నుదిటిపై చేయిపెట్టి నూకగానే అది అక్కడినుంచి తిరుగుముఖం పట్టింది. ఈ వీడియో ఇన్‌స్టాలో పెట్టగా, వైరల్‌ అయ్యింది. 

ఆస్ట్రేలియాకు చెందిన మాట్ రైట్ తన సహోద్యోగి టామీ నికోలస్‌తో కలిసి ఉత్తర భూభాగంలోని జలమార్గంలో దుంగలను పైకి లాగుతున్నాడు. ఈ సమయంలో అక్కడికి భారీ మొసలి వచ్చింది. అయితే మాట్‌ అందరిలా కంగారుపడకుండా దాన్ని పో అని గద్దించాడు. అది వెనుదిరిగింది. మళ్లీ అతడివైపు వచ్చింది. ఈసారి దాని నుదుటిపై చేయిపెట్టి వెళ్లిపొమ్మన్నాడు. అది వెంటనే అక్కడినుంచి వెళ్లిపోయింది. ఈ వీడియో చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.  ఇప్పటివరకూ దీన్ని 1.7 లక్షలకు పైగా మంది వీక్షించారు.  

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo