సోమవారం 28 సెప్టెంబర్ 2020
International - Aug 10, 2020 , 16:52:28

ప్రియురాలిని ఏడిపించ‌డానికి పెద్ద డ్రామా.. మ‌రీ ఇంత అమాయ‌కంగా ఉంటే ఎలా!

ప్రియురాలిని ఏడిపించ‌డానికి పెద్ద డ్రామా.. మ‌రీ ఇంత అమాయ‌కంగా ఉంటే ఎలా!

అమ్మాయిలు గాని, అబ్బాయిలు గాని ఇద్ద‌రిలో ఒక‌రు అమాయ‌కంగా ఉంటే రెండో మనిషి ఒక ఆట ఆడేసుకుంటారు. ఆడుకోవ‌డం మాములుగా ఉండ‌దు. పీక్స్‌కు వెళ్తుంది. కావాలంటే ఈ వీడియోను మీరే చూడండి. ఈ అమ్మాయి మ‌రీ ఎంత అమాయ‌కంగా ఉందంటే.. ప్రియుడి మీద ప్రేమ‌తో అత‌ను ఏం చెప్పినా న‌మ్మేసింది. 59 సెకండ్ల పాటు న‌డిచే ఈ వీడియో నెటిజ‌న్ల‌ను బాగా ఆక‌ట్టుకున్న‌ది.

వీడియోలో ఒక అబ్బాయి త‌న ప్రేయ‌సిని ఏడిపించ‌డానికి వేలు గాయ‌ప‌డిన‌ట్లు యాక్టింగ్ చేశాడు. ముందుగా అంతా ప్లాన్ చేసుకొని త‌ర్వ‌త వేలు ఇరుక్కున్న‌ట్లు పెద్ద‌గా అరిచాడు. దాంతో ఆమె ప‌రుగెత్తుకుంటూ వ‌చ్చి అయ్యో ఏమైంది అంటూ అమాయ‌కంగా అడిగితే అతన్ని ప్ర‌మాదం నుంచి త‌ప్పించడానికి గోరును క‌త్తిరించ‌మ‌ని అడుగుతాడు. అది వివ‌రించేట‌ప్పుడు గాయ‌ప‌డిన వేలునే రెండు, మూడుసార్లు బ‌య‌ట‌కు తీసి చూపిస్తాడు. చివ‌రికి గాని అమెకు అర్థం కాలేదు. అది డ్రామా అని. అత‌ను ఆమెను ఫూల్ చేసినా అత‌ని మీద ఆమెకున్న ప్రేమకు మాత్రం నెటిజ‌న్లు ఫిదా అయ్యారు. అందుకే ఈ వీడియోను 4 మిలియ‌న్ల మంది వీక్షించారు. logo