సోమవారం 28 సెప్టెంబర్ 2020
International - Jul 30, 2020 , 15:25:49

గోల్ఫ్ బాల్ త‌గిలి అప‌స్మార‌క స్థితిలో వ్య‌క్తి.. భ‌య‌ప‌డిన క్రీడాకారుడు!

గోల్ఫ్ బాల్ త‌గిలి అప‌స్మార‌క స్థితిలో వ్య‌క్తి.. భ‌య‌ప‌డిన క్రీడాకారుడు!

గోల్ఫ్ బాల్ చాలా చిన్న‌గా ఉంటుంది. ఇది త‌గిలినా కాస్త నొప్పిగా అనిపిస్తుంది. కానీ అప‌స్మార‌క స్థితిలోకి వెళ్లేంత ప్ర‌మాదం మాత్రం జ‌ర‌గ‌దు. కానీ గోల్ఫ్ బాల్ త‌గిలి ఓ వ్య‌క్తి నేల మీద ప‌డిపోయాడు. 45 సెకండ్ల‌పాటు న‌డిచే ఈ వీడియోను అమెరిక‌న్ ఫుట్‌బాల్ ప్లేయ‌ర్ రెక్స్ చాప్మ‌న్ ట్విట‌ర్‌లో షేర్ చేశారు. 'బహుశా నేను ఇలాంటి వీడియోను ఇప్ప‌టి వ‌ర‌కు చూడ‌లేదు. న‌వ్వుని ఆపుకోలేము' అనే శీర్షిక‌తో షేర్ చేశారు. 

అయితే ఆ వ్య‌క్తి నిజంగా బాల్ త‌గిలి ప‌డిపోలేదు. గోల్ఫ్ క్రీడాకారుడిని భ‌య‌పెట్ట‌డం కోసం ఇత‌ను ఇలా యాక్ట్ చేశాడు. ఆడుకునేట‌ప్పుడు బాల్‌ ఇంటి పెర‌డులో ప‌డే స‌మ‌యానికి అత‌ను అక్క‌డే ఉన్నాడు. కొంచెం ఆట‌ప‌ట్టిద్దాం అని బాల్ ప‌క్క‌న ప‌డిపోయిన‌ట్లు ప‌డుకున్నాడు.  క్రీడాకారుడు బాల్‌ను వెతుక్కుంటూ వ‌చ్చేస‌రికి అత‌ను త‌ల‌ను నిమురుకుంటూ పైకి లేచి, అత‌నికి బాల్ విసురుతాడు. అత‌ను ఇంట్లోకి వెళ్లేంత వ‌ర‌కు త‌ల‌ను రుద్దుకుంటూనే వెళ్తుండే స‌రికి క్రీడాకారుడుకి భ‌యంతో పాటు ఆశ్చ‌ర్యం కూడా వేసింది. ఈ వీడియో మిలియ‌న్లకు పైగానే వీక్ష‌కుల‌ను సంపాదించుకున్న‌ది. 

 


logo