శనివారం 16 జనవరి 2021
International - Jan 11, 2021 , 19:00:18

తలలో కత్తి దిగినట్లు నటించాడు.. ప్రియురాలు ఏం చేసిందంటే..

తలలో కత్తి దిగినట్లు నటించాడు.. ప్రియురాలు ఏం చేసిందంటే..

వాషింగ్టన్‌: ఓ వ్యక్తి తన తలలో కత్తి దిగినట్లు ప్రియురాలి ముందు నటించాడు. దీనికి ఆమె రియాక్షన్‌ చూసిన వారు పగలబడి నవ్వుకున్నారు. ఇన్‌స్టాగ్రామ్ యూజర్ పోస్ట్‌ చేసిన ఈ ఫ్రాంక్‌ వీడియో వైరల్‌ అయ్యింది. లాన్స్ స్టీవర్ట్ అనే వ్యక్తి తన ప్రియురాలిని భయపెట్టాలనుకున్నాడు. తలలో కత్తి దిగి రక్తం కారుతున్నట్లుగా ఉన్న దానిని ధరించాడు. అనంతరం వంట గది నుంచి కేకలు వేశాడు. 

దీంతో ప్రియురాలు జూలియా ఏం జరిగిందోనని కంగారుపడుతూ అతడి వద్దకు వచ్చింది. తల నుంచి కత్తి దిగినట్లుగా ఉండటం చూసి భయాందోళనకు గురైంది. ఆ కత్తిని తన చేతితో తీయబోయింది. స్టీవర్ట్‌ వారించడంతో ఎమర్జెన్సీకి ఫోన్‌ చేయబోయింది. అయితే తాను ఫ్రాంక్‌ చేసినట్లు స్టీవర్ట్‌ చెప్పడంతో ఆ షాక్‌ నుంచి ఆమె తేరుకున్నది. ఈ ఫ్రాంక్‌ వీడియోను అతడు సామాజిక మాధ్యమంలో పోస్ట్‌ చేయగా వైరల్‌ అయ్యింది. అయితే ప్రియురాలిని భయపెట్టేందుకు స్టీవర్ట్‌ చేసిన ట్రిక్‌పై నెటిజన్లు భిన్నంగా స్పందించారు. 


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.