మంగళవారం 29 సెప్టెంబర్ 2020
International - Jul 25, 2020 , 14:16:08

మొల‌కు మాస్కుతో వ్య‌క్తి న‌గ్న ప్ర‌ద‌ర్శ‌న!

మొల‌కు మాస్కుతో వ్య‌క్తి న‌గ్న ప్ర‌ద‌ర్శ‌న!

హైద‌రాబాద్‌: అది సెంట్ర‌ల్ లండ‌న్‌లోని ఓ ప్ర‌ఖ్యాత వీధి. ఆ వీధిని ఆక్స్‌ఫ‌ర్డ్ స్ట్రీట్ అని పిలుస్తారు. ప్ర‌స్తుతం లాక్‌డౌన్ కార‌ణంగా ర‌ద్దీ పెద్దగా లేకున్నా అంత‌కుముందు పాపింగ్‌కు వ‌చ్చే జ‌నంతో ఆ వీధి మొత్తం కిట‌కిట‌లాడితే. అయితే, శుక్ర‌వారం ఆ వీధి గుండా వెళ్లేవారిని ఓ వ్య‌క్తి ఆశ్చ‌ర్యానికి, అయోమ‌యానికి, షాక్‌కు గురిచేశాడు. ఇంత‌కు అత‌డు చేసిన ప‌నేంది అనుకుంటున్నారా..? మొల భాగంలో మాస్కు త‌ప్ప ఒంటిపై నూలుపోగు కూడా లేకుండా ఆక్స్‌ఫ‌ర్డ్ వీధి గుండా న‌డుచుకుంటూ వెళ్లాడు. 

అయితే, ఒక్క‌సారిగా ఒంటిపై బ‌ట్ట‌లు లేకుండా వ్య‌క్తి ఎదురుప‌డ‌టంతో కొంత‌మంది న‌వ్వుకున్నారు. మ‌రి కొంత‌మంది ఈసడించుకున్నారు. ఇంకొంత మంది నోరెళ్ల‌బెట్టి చూశారు. కొంద‌రైతే ఏకంగా త‌మ ఫోన్‌ల‌లో ఫొటోలు, వీడియోలు కూడా తీసుకున్నారు. కానీ, ముఖానికి మాస్కు లేకున్నా మొల‌కు మాత్రం మాస్కు ధ‌రించి ప్ర‌ద‌ర్శ‌న చేయ‌డం వెనుక అత‌ని ఉద్దేశం ఏమిట‌నేది మాత్రం ఎవ‌రికీ అర్థం కాలేదు. కాగా, ఈ దృశ్యాల‌ను రాయిట‌ర్స్ సంస్థ‌కు చెందిన కెమెరామెన్ కార్యాల‌యం భ‌వ‌నం పైనుంచే త‌న కెమెరాలో బంధించాడు.  

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo