సోమవారం 28 సెప్టెంబర్ 2020
International - Aug 25, 2020 , 13:59:58

బట్ట‌లు ఆర్డ‌ర్ పెడితే పురుగులు కూడా వ‌చ్చాయి.. షాక్‌లో క‌స్ట‌మ‌ర్‌!

బట్ట‌లు ఆర్డ‌ర్ పెడితే పురుగులు కూడా వ‌చ్చాయి.. షాక్‌లో క‌స్ట‌మ‌ర్‌!

క‌రోనా మ‌హ‌మ్మారి పుణ్య‌మా అంటూ ఇప్ప‌టివ‌ర‌కు ఆన్‌లైన్‌లో  కొనుగోలు చేయ‌ని వారు కూడా ఏం కావాల‌న్నా ఆన్‌లైన్‌ను సంప్ర‌దిస్తున్నారు. బ‌ట్ట‌లు ఆర్డ‌ర్‌ పెట్టిన త‌ర్వాత డెలివ‌రీ ఎప్పుడెప్పుడు వ‌స్తుందా అని ఎదురుచూస్తుంటాం. తీరా వ‌చ్చిన త‌ర్వాత కొంచెం క‌ల‌ర్ త‌క్కువైనా ముఖంలో క‌ల‌ర్ త‌గ్గిపోతుంది. అలాంటిది దానికి ఏమైనా డ్యామేజ్ జ‌రిగితే ఇంకేమన్నా ఉందా.. గుండె ప‌గిలిపోతుంది. పోనీ ఆర్డ‌ర్ పెట్టిన బ‌ట్ట‌ల‌తో ఏదైనా ఆఫ‌ర్ వ‌స్తే ఇంకేముంది ఎగిరి గంతేస్తాం. ఆ ఆఫ‌ర్ భ‌యం క‌లిగించేదైతే.. ఇదంతా ఎందుకు అస‌లు విష‌యంలోకి వెళ్దాం.

న్యూయార్క్‌లో నివ‌సిస్తున్న బెంజ‌మిన్ అనే వ్య‌క్తి నైక్ అనే ఆన్‌లైన్ సైట్ నుంచి కొన్ని డ్రెస్‌లు ఆర్డ‌ర్ పెట్టాడు. కొన్నిరోజుల త‌ర్వాత డెలివ‌రీ రానే వ‌చ్చింది. ఎంతో ఆత్రంగా అన్‌బాక్స్ చేసి చూస్తే షాక్‌కు గుర‌య్యాడు క‌స్ట‌మ‌ర్‌. ఆనంద‌ప‌డాల్సింది పోయి భ‌య‌ప‌డ్డాడు. ఎందుకంటే బ‌ట్ట‌లు నిండా డ‌జ‌న్ల‌కొద్ది పురుగులున్నాయి. వెంట‌నే వీటిని ఫోటోలు, వీడియోలు తీసి సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆశ్చ‌ర్యం ఏంటంటే.. డెలివ‌రీ ప్యాకేజ్‌కు ఎలాంటి డ్యామేజ్ లేదు. టేపుతో అంతా చుట్టేసి ఉంది. విష‌యాన్ని నైక్ సంస్థ‌కు తెలియ‌జేయ‌గా రీఫండ్ చెల్లిస్తామ‌న్నారు. కొంత‌మంది ఇది కావాల‌ని ఎవ‌రో చేసిన‌ట్లు ఉందని అంటే  మరికొంత‌మంది అలా ఎందుకు చేస్తారంటున్నారు. అయినా పురుగులు పాకిన ఈ దుస్తులను వేసుకుంటే.. నిజంగా శరీరంపై పురుగులు పాకినట్లే ఉంటుంది కదూ..!


logo